Puri Jagannath Rath Yatra: జగన్నాథుడి “రథయాత్ర” ప్రారంభం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannath Rath Yatra: ఒడిశా పూరీలోని జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు పూరీకి చేరుకున్నారు. పూరీ క్షేత్రం మొత్తం ఆధ్యాత్మికంగా మారింది. ఒడిశా ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్టించిన తర్వాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటలక పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపహర( బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. 3 గంటలకు భక్తుల రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేల ఏర్పాట్లు చేశారు.
Read Also: Baby Care Tip: పిల్లలు ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా?
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
రథయాత్ర ప్రారంభం కావడంతో భక్తులందరికీ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడు ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం నిపాలని కోరుకున్నారు. ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లోని జగన్నాథ మందిరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రార్థనలు చేశారు. మంగళవారం ఉదయం పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతిని కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రథయాత్ర సందర్భంగా భక్తులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రథయాత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని కోరారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రథయాత్రకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
పెద్ద సంఖ్యలో భక్తులు పూరీకి తరలివస్తుండటంతో ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. 180 ప్లాట్లూన్ల బలగాలను మోహరించారు. బీచ్ పెట్రోలింగ్ కోసం కోస్ట్ గార్డు హెలికాప్టర్ తో పహారా కాస్తున్నారు. రథయాత్ర సందర్భంగా పూరీకి దేశంలోని పలు ప్రాంతాల నుంచి 125 ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు.
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!