Rajasthan: గొర్రెకు కోటి రూపాయల ఆఫర్.. తిరస్కరించిన యజమాని.. ఎందుకంత ప్రత్యేకం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: బక్రీద్ పండగ వచ్చింది. దీంతో మేకలకు, గొర్రెలకు విపరీతమై డిమాండ్ ఏర్పడింది. గతంలో పోలిస్తే పండగ సీజన్ కావడంతో మేకలు, గొర్రెల్లో వేల రూపాయల ధర పలుకుతున్నాయి. అయినా కూడా కొనేందుకు ముస్లింలు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ లో ఓ వ్యక్తికి చెందిన గొర్రె పిల్లకు ఏకంగా రూ. 1 కోటి ధర పలికింది. అయినా కూడా ఈ గొర్రెను అమ్మేందుకు దాని యజమాని రాజు సింగ్ తిరస్కరించారు.
Read Also: UCC: యూసీసీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. అర్ధరాత్రి ముస్లిం లాబోర్డు అత్యవసర సమావేశం..
Also Read
- Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లా తారానగర్ కి చెందిన రాజు సింగ్ కు సంబంధించిన ఓ గొర్రె పిల్లను వేలం వేయగా ఏకంగా కోటి రూపాయల ధర పలికింది. అయితే దాన్ని అమ్మేందుకు మాత్రం అతను నిరాకరించాడు. గొర్రె తనకు ఎంతో ప్రియమైందని, కాబట్టి దీన్ని అమ్మలేనని ఆయన అన్నారు. ఇప్పుడు ఇది తారానగర్ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ గొర్రెపిల్ల శరీరంపై ఉన్న 786 అనే అంకె ముస్లింలకు చాలా పవిత్రమైనది. ఇస్లాంలో ఈ అంకెకు చాలా ప్రాధాన్యం ఉంది. గొర్రెపిల్ల శరీరంపై ఉన్నది ఎంటో తెలియదని యజమాని రాజు సింగ్ తెలిపారు. ముస్లిం వర్గానికి చెందిన కొందర్ని సంప్రదిస్తే ఈ విషయం తెలిసిందని ఆయన చెప్పారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ.. ఈ గొర్రె అంటే తనకు చాలా ఇష్టం అని అందుకే దీన్ని అమ్మడం లేదని చెప్పాడు. గతేడాది ఓ ఆడగొర్రెకు ఈ గొర్రెపిల్ల జన్మించింది. వేలం వేస్తున్న సమయంలో ఏకంగా రూ.70 లక్షలు నుంచి కోటి రూపాయలు ఇస్తామన్నారని తెలిపాడు. గొర్రె పిల్లకు భారీ ధర రావడంతో ఇప్పుడు రాజు సింగ్ దాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నాడు. దానికి దానిమ్మ, బొప్పాయి, మినుములు, పచ్చి కూరగాయలను ఆహారంగా ఇస్తున్నాడు. భద్రతా కారణాలతో ఇప్పుడు ఆ గొర్రెను తన ఇంటిలోనే ఉంచుతున్నాడు.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!