UK: సూర్యుడు అస్తమించని అగ్రరాజ్యం.. ఇప్పుడు ఆకలితో అలమటిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Inflation In UK: ఒకప్పుడు సూర్యడు అస్తమించన రాజ్యంగా పేరు తెచ్చుకున్న యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. అధిక ద్రవ్యోల్భణం అక్కడి ప్రజలను, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఓ నివేదిక పేర్కొంది. యూకేలోని ప్రతీ ఏడుగురు వ్యక్తుల్లో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని, గతేడాదిగా ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో ఆకలి కేకల్ని ఎదుర్కొంటున్నారని ఫుడ్ బ్యాంక్ స్వచ్ఛంద సంస్థ ట్రస్సెల్ ట్రస్ట్ బుధవారం ప్రచురించిన నివేదిక వెల్లడించింది.
యూకేలో మొత్తం 11.3 మిలియన్ల మంది ఆకలిని ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇది స్కాట్కాండ్ జనాభా కన్నా రెట్టింపు కంటే ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్ ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అయితే గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఓ నివేదిక ప్రకారం యూకే జీడీపీకి సమానంగా ఆ దేశ అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ద్రవ్యోల్భణం, నిత్యావసరాల ధరల కారణంగా ఒక ఏడాదిగా అక్కడి ప్రజలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్భణం దాదాపుగా అందరు కార్మికులు వేతన వృద్ధిని అధిగమించింది.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
Read Also: Keerthy Suresh: బ్లాక్ కలర్ డ్రెస్సులో హాట్ బాంబ్ లా కీర్తి సురేష్.. ఫొటోలు చూశారా?
యూకేలో ట్రస్సెల్ ట్రస్ట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న 1300 ఫుడ్ బ్యాంక్ సెంటర్లలో మార్చి వరకు రికార్డు స్థాయిలో 3 మిలియన్ ఆహార ప్యాకెట్లను అందించింది. ఇది గతంతో పోలిస్తే 37 శాతం పెరిగింది. ఐదేళ్ల క్రితం గణాంకాలతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. జీవన వ్యయ సంక్షోభం, మహహ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యూకే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. యూకే జనాభాలో 7 శాతం మంది ఆహార బ్యాంకులతో సహా చారిటబుల్ ఫుడ్ సపోర్టు ద్వారా బతుకీడుస్తున్నారు.. ఇంకా 71 శాతం మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది.
ఫుడ్ నెట్వర్క్ ని ఆశ్రయిస్తున్న ఐదుగురిలో ఒకరు పనిచేసే కుటుంబం నుంచి ఉంటున్నారని తెలిపింది. ప్రజలు కష్టపడుతున్నారని మాకు తెలుసని, ఒక్కో ఇంటికి సగటున 3,300 పౌండ్ల విలువైన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని డిపార్ట్‌మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్‌ల ప్రతినిధి చెప్పారు. ప్రభుత్వం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రయోజనాలు మరియు రాష్ట్ర పెన్షన్‌ను కూడా పెంచింది, కనీస వేతనాన్ని పెంచింది మరియు ఆహారం, శక్తి మరియు ఇతర అవసరమైన ఖర్చులతో కుటుంబాలను ఆదుకుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!