IT hirings: ఆర్థికమాంద్యం భయాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ టెక్ కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునేందు తమ ఉద్యోగులను ఎడాపెడా తీసేశాయి. వేల సంఖ్యలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ ఇతర యూరప్ దేశాల్లో కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన టెక్ ఉద్యోగుల్లో భారతీయులు కూడా ఉండటం ఇక్కడి వారిని కలవరానికి గురిచేస్తోంది. ఇక దేశీయ టెక్ కంపెనీలు కూడా పలువురిని ఉద్యోగాల నుంచి తీసేశాయి.
Read Also: Pakistan: పాకిస్తాన్ లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది హత్య..
మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ వంటి సంస్థలు వేల మంది కొలువులను తీసేసింది. ఇదిలా ఉంటే ఓ భారతీయ ఐటీ కంపెనీ మాత్రం కొత్తగా 6000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. ముంబై హెడ్ క్వార్టర్స్ కలిగిన హెగ్జావేర్ టెక్నాలజీస్ దాదాపుగా 6 వేల మందిని నియమించుకోవాలని చూస్తోంది. లింక్డ్‌ఇన్‌లో 419 ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేసింది. నోయిడా, ముంబై కార్యాలయాల్లో ఓపెనింగ్స్ ఉన్నాయి. హెగ్జావేర్ అనేది ఐటీ, పీబీఎస్, కన్సల్టింగ్ సర్వీసెస్ అందించే ఆటోమేషన్ నేతృత్వంలో నెక్స్ట్ జనరేషన్ సర్వీస్ ప్రొవైడర్ అని లింక్డ్ ఇన్ బయోలో పేర్కొంది.