Benjamin Mendy: మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ ఆటగాడు బెంజమిన్ మెండీ 10,000 మంది మహిళలతో సెక్స్ చేసినట్లు ఒప్పుకున్నాడు. అక్టోబర్ 2020లో చెషైర్ లోని మెట్రామ్ సెయింట్ ఆండ్రూలోని తన భవనంలో 24 ఏళ్ల వయసు ఉన్న యువతిపై 28 ఏళ్ల బెంజమిన్ మెండీ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిని కోర్టు విచారించింది. ఆ యువతిపై అత్యాచారం చేస్తూ తాను 10,000 మంది మహిళలతో సెక్స్ చేశానని చెప్పినట్లు జ్యూరీ పేర్కొంది. అతనిపై చెస్టర్ క్రౌన్ కోర్టులో విచారణ జరుగుతోంది.
అదే సమయంలో 29 ఏళ్ల యువతిపై కూడా బెంజమిన్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరొకరిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని మెండీ తోసిపుచ్చాడు. కేసు విచారణ విషయాలకు వస్తే.. బెంజమిన్ మెండీ సోషల్ గ్యాదరింగ్స్ లో ఇద్దరు మహిళను బలవంతం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక సందర్భంలో మెండీ బలవంతంగా యూకేకి చెందిన మహిళపై సెక్స్ చేయడానికి ప్రయత్నించాడు. మరొక సమయంలో మరో యువతిని తన బెడ్రూంలోనే రేప్ చేసినట్లు ప్రాసిక్యూటర్ బెంజమిన్ ఐన కోర్టుకు తెలిపారు.
Read Also: Ponguleti Srinivas Reddy: జూలై 2న రాహుల్ సభ సక్సెస్ చేస్తాం.. సీఎం కేసీఆర్ కు పొంగులేటి సవాల్..!
2017 చివర్లో బార్సిలోనాలోని నైట్ క్లబ్ లో ఉన్నప్పుడు ఓ యూకేకి చెందిన యువతిని మెండీ తొలిసారిగా కలిశాడు. ఓసారి సదరు యువతి మెండీ ఇంటికి పార్టీకి వచ్చిన సమయంలో, ఆమె బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు మెండీ కావాలని సదరు యువతిని బలవంతం చేశాడని కోర్టుకు ప్రాసిక్యూటర్ తెలిపారు. ఆమె ఎంతగా ప్రతిఘటించినప్పటికీ మంచంపై తోసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రెండేళ్ల తర్వాత మెండీ, తన ఇంటికి సమీపంలో ఉన్న బార్ లో కలిసిన మరో మహిళని, ఆమె స్నేహితులను తన ఇంటికి ఆహ్వానించాడు. మెండీ సదరు యువతి ఫోన్ ను తీసుకుని, ఇందులో అభ్యంతరకర ఫోటోలు ఉన్నాయని చెబుతూ.. యువతిని తన బెడ్రూంకి వచ్చేలా చేశాడని.. ఆ సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు, యువతికి ఇష్టం లేకున్నా ఇలా చేసినట్లు కోర్టులో వాదనలు సాగాయి. గతంలో జరిగిన విచారణలో జ్యూరీ నిర్ణయం తీసుకోలేకపోయినందున వాటి మళ్లీ విచారించాలని ట్రయల్ జడ్జి స్టీఫెన్ ఎవెరెట్ 12 మంది జ్యూరీకి తెలియజేశాడు.