Kim Jong Un: వరస మిస్సైల్ టెస్టులు, గూఢాచర ఉపగ్రహాల ప్రయోగంతో కిమ్ జోంగ్ ఉన్ అమెరికాకు సవాల్ విసురుతున్నాడు. జపాన్, దక్షిణకొరియా, యూఎస్ వార్నింగులను ఖాతరు చేయడం లేదు ఉత్తర కొరియా నియంత. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మిస్సైల్ లాంచర్ల ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది. వీటిని రష్యాకు అందించేందుకే ఉత్పత్తిని పెంచాలని కిమ్ చెప్పనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్ నగరాలపై జరిగి దాడుల్లో వాడిన బాలిస్టిక్ మిస్సైల్స్, లాంచర్లను ఉత్తర కొరియానే రష్యాకు అందించినట్లు వైట్ హౌస్ పేర్కొంది.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్
ఉక్రెయిన్ యుద్ధంలో వాడేందుకు రష్యాకు ఉత్తర కొరియా మిస్సైల్స్, లాంచర్లను అందించినట్లు వైట్ హౌజ్ గురువారం ఆరోపించింది. ఇలా ఆయుధాలను రష్యాకు బదిలీ చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ విలేకరులతో అన్నారు. ఇరాన్ రష్యాకు క్లోజ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను అందించలేదని, అయితే కొనుగోలు చేయాలని రష్యా భావిస్తోందని కిర్బీ చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంలో ఆయుధాల కోసం, ముఖ్యంగా డ్రోన్ల కోసం రష్యా, ఇరాన్‌పై ఆధారపడుతోంది.
మరోవైపు గతేడాది చివర్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనకు వెళ్లారు. పుతిన్‌తో కిమ్ భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఆయుధ సరఫరా కోసం ఒప్పందం కుదిరినట్లు అమెరికా ఆరోపించింది. ఆయుధాలకు ప్రతిగా తమకు శాటిలైట్ సాంకేతికతో పాటు జలంతర్గామి సాంకేతికతను తమకు ఇవ్వాలని ఉత్తర కొరియా కోరినట్లు తెలుస్తోంది.