Aditya- L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సన్ మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగం తుది దశకు చేరుకుంది. వచ్చే ఐదేళ్ల పాటు సూర్యుడికి సంబంధించిన వివరాలను ఆదిత్య ఎల్-1 భూమికి పంపించనుంది. జనవరి 6 సాయంత్రం 4 గంటలకు శాటిలైట్ తన గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 2న ప్రయాణం మొదలుపెట్టిన ఆదిత్య ఎల్-1, 126 రోజుల పాటు ప్రయాణించి నిర్దేశిత లాగ్రేజియన్ పాయింట్-1(L1)కి చేరనుంది.
భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఎల్-1 పాయింట్ వద్ద హాలో కక్ష్యలో ఆదిత్య ఎల్-1 చేరనుంది. ఇక్కడ నుంచి ఆదిత్య ఎల్-1 సూర్యుడి గుట్టు విప్పేందుకు తనలో ఉన్న పరికరాలను వాడనుంది. సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌరజ్వాలల వంటి విషయాలపై అధ్యయనం చేస్తుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ అన్నారు. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 పూర్తి ఆరోగ్యం ఉందని ఇస్రో ప్రకటించింది.
Read Also: Hit and Run Law: హిట్ అండ్ రన్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ 48 గంటల సమ్మెకు పిలుపు
సూర్యుడిపై ఎల్లప్పుడు ఆదిత్య కన్నేసి ఉంచుతుంది కాబట్టి.. ఇది సూర్యుడిపై ఏర్పడే సౌర విద్యుదయస్కాంత ప్రభావాల గురించి ముందస్తుగా హెచ్చరిస్తుందని, మన ఉపగ్రహాలకు, కమ్యూనికేషన్ వ్యవస్థకు నష్ట కలగకుండా కాపాడుతుందని, సౌర తుఫానులు దాటిపోయేంత వరకు మన శాటిలైట్లకు విఘాతం కలగకుండా, సేఫ్టీ మోడ్‌లో ఉంచేందుకు సాయపడుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. మనకు అంతరిక్షంలో రూ. 50,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయిని, 50కి పైగా శాటిలైట్స్ పనిచేస్తున్నాయని, వీటిని రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆదిత్య ఎల్-1 సౌర తుఫానులపై నిఘా ఉంచి, అంతరిక్ష రక్షకుడిగా మారనుంది.
సాధారణంగా సౌర తుఫానుల నుంచి వెలువడే ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రమాదకరమైన తరంగాలు అంతరిక్షంలోని శాటిలైట్స్, భూమిపై ఉన్న పవర్ గ్రిడ్స్‌పై ప్రభావం చూపిస్తాయి. వీటిని ముందుగానే ఆదిత్య-ఎల్1 గుర్తిస్తుంది. దీని వల్ల శాటిలైట్లను రక్షించుకోవచ్చు.