Islamic State: ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ చీఫ్ ఖాసిం సులేమానీ స్మారకార్థం, ఆయన హత్యకు గురై నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా.. ఇరాన్ లోని కెర్మాన్‌లో శ్రద్ధాంజలి ఘటించేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలో జరిగిన రెండు భారీ బాంబు పేలుళ్లలో 103 మంది మరణించారు. అయితే ఈ దాడి తమ పనే అని ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించింది. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
Read Also: Aditya- L1: తుది దశకు ఆదిత్య ఎల్-1 ప్రయాణం.. 6న గమ్యస్థానానికి శాటిలైట్..
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా ఖాసిం సులేమానికి పేరుంది. ఇరాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో, బాగ్దాద్‌లో అతడిని అమెరికా హతమార్చింది. డ్రోన్ ద్వారా అతను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని పేల్చేసింది. ఈ ఘటన 2020లో జరిగింది. అతను మరణించి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అతని స్వస్థలం కెర్మాన్ లోని సాహెబ్ అల్ జమాన్ సమీదు సమీపంలో పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో 170 మంది మరణించినట్లు ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ బాంబు దాడులకు అమెరికా, ఇజ్రాయిల్ కారణమని ఇరాన్ నిందించింది.