Nepal: భారత వ్యాపారవేత్తపై ప్రధాని పుష్పకమల్ దహల్ కామెంట్స్.. రాజీనామా చేయాలని డిమాండ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్(ప్రచండ) చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే నేపాల్ రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయి. తాజాగా పీఎం దహల్ చేసిన వ్యాఖ్యలు అక్కడ అగ్గిని రాజేశాయి. నేపాల్ లో స్థిరపడిన ఓ భారతీయ వ్యాపారవేత్తను ఉద్దేశించి.. గతంలో ఆయన తనను ప్రధాని చేయడానికి కృషి చేశాడని ప్రధాని వ్యాఖ్యానించడం వివాదాన్ని రేకెత్తించింది. దీంతో ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
నేపాల్‌లోని అగ్రగామి ట్రక్కింగ్ వ్యవస్థాపకుడు సర్దార్ ప్రీతమ్ సింగ్ నేపాల్-భారత్ సంబంధాలను మెరుగుపరచడంలో ప్రత్యేక మరియు చారిత్రాత్మక పాత్ర పోషించారని ప్రచండ అన్నారు. ‘రోడ్స్ టు ది వ్యాలీ: ది లెగసీ ఆఫ్ సర్దార్ ప్రీతమ్ సింగ్ ఇన్ నేపాల్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సోమవారంనాడు ప్రచండ ఈ వ్యాఖ్యలు చేశారు. నన్ను ప్రధాని చేయడానికి అయన అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి.. ఖాట్మాండులోని రాజకీయ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Also Read
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
Read Also: Inaya sultana : జారిపోతున్న డ్రెస్ లో బరువైన అందాలతో హాట్ షో చేస్తున్న ఇనయా..
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-(యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) (CPN-UML) బుధవారం జరిగిన జాతీయ అసెంబ్లీ సమావేశానికి అంతీరాయం కలిగించి, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దీంతో గురువారం సభ మధ్యాహ్నాం 1 గంటలకు వాయిదా పడింది. కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మాట్లాడుతూ.. ఆయన వ్యాఖ్యలు దేశ స్వాతంత్య్ర, గౌరవం, రాజ్యాంగం, పార్లమెంట్ కు దెబ్బ అని అన్నారు. న్యూఢిల్లీ నియమించిన ప్రధాని పదవిలో కొనసాగే హక్కు లేదని ప్రధాన ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి.
ప్రచండ వ్యాఖ్యలపై విపక్షాలే కాకుండా అధికార పక్ష నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పీఎం ప్రచండ అన్నారు. నా అభిప్రాయం నేపాల్ అంతర్గత విషయాల్లో భారత్ జోక్యం చేసుకుందని చెప్పడం కాదని.. సర్దార్ ప్రతీమ్ సింగ్ కు రాజకీయాల్లో ఆసక్తి ఉందని చెప్పడమే అని అన్నారు.
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!