Australia: భారత నర్సింగ్ విద్యార్థిని సజీవ సమాధి.. ప్రేమను తిరస్కరించిందని ప్రియుడి ఘాతుకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia: ఆస్ట్రేలియా లోని 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని జాస్మీన్ కౌర్ ను ఆమె మాజీ లవర్ దారుణంగా హత్య చేశాడు. 2021లో ఆమె లవర్ తారిక్‌జోత్ సింగ్ ఆమెను కిడ్నాప్ చేసి ప్రాణం ఉండగానే పూడ్చి పెట్టాడు. ప్రతీకారంతో తారిక్‌జోత్ సింగ్ యువతిని దారుణంగా హత్య చేసిన కేసును అక్కడి కోర్టు బుధవారం విచారించింది. అడిలైడ్ నగరంలో నివాసం ఉంటున్న జాస్మీన్ కౌర్ ని తానే హత్య చేసినట్లు బుధవారం కోర్టు విచారణలో తారిక్‌జోత్ సింగ్ అంగీకరించాడు.
21 ఏళ్ల కౌర్‌ని మార్చి 5, 2021న తారిక్‌జోత్ సింగ్ ఆమె ఆఫీస్ నుంచి కిడ్నాప్ చేశాడు. తన స్నేహితుడి కారుని తీసుకుని, కారు డిక్కీలో జాస్మీన్ కౌర్ ని బంధించాడు. దాదాపుగా 650 కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణ ఆస్ట్రేలియాలోని మారుమూల ప్లిండర్స్ రేంజ్ కి తీసుకెళ్లాడు. అక్కడ యువతి గొంతు కోసి, ఆ తరువాత తాడుతో కట్టేసి సజీవంగా సమాధి చేశాడు. ఈ ఘటనను విచారించిని సుప్రీంకోర్టు ఈ హత్యను అత్యంత దారుణమైనదిగా పేర్కొంది. బాధితురాలు దారుణమైన బాధను అనువించిందని ప్రాసిక్యూటర్ కార్మెన్ మాటియో చెప్పారు. ఆమె ప్రాణాలతో ఉన్న సమయంలో పూడ్చివేయడం వల్ల మట్టిని పీల్చడం, మింగడం జరిగిందని తీవ్రమైన బాధను అనుభవించాల్సి వచ్చిందని మాటియో పేర్కొన్నాడు. ఇది ప్రతీకార హత్యగా చెప్పారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
తారిక్‌జోత్ సింగ్ తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఒక నెలకు జాస్మీన్ కౌర్ దారుణ హత్యకు గురైందని న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. తన కుమార్తె, నిందితుడిని వందల సార్లు తిరస్కరించిందని బాధితురాలి తల్లి చెప్పింది. తారిక్ జోత్ సింగ్, జాస్మీన్ కౌర్ తో రిలేషన్ దెబ్బతినడంతో ప్రతీకారంతో హత్యకు ప్లాన్ చేశాడు. అయితే ముందుగా జాస్మీన్ కౌర్ ఆత్మహత్య చేసుకుందని.. ఆ తరువాత ఆమెను పూడ్చివేశానని ముందుగా తారిక్ జోత్ సింగ్ చెప్పాడు. అయితే విచారణ ఈ ఏడాది ప్రారంభంలో విచారణకు రాకముందే అతను హత్యానేరాన్ని అంగీకరించాడు.
సంఘటన స్థలానికి పోలీసులు తీసుకెళ్లిన సమయంలో జాస్మీన్ కి సంబంధించిన బూట్లు, గాజులు, బ్యాడ్జ్, ఆమెను కట్టేసిన తాళ్లను కనుగొన్నారు. కిడ్నాప్ జరిగిన రోజు తారిక్ హార్డ్ వేర్ షాపులో చేతి గొడుగు, కేబుల్స్, పార షాపింగ్ చేస్తున్నట్లు కెమెరాల్లో రికార్డైంది. కాగా తారిక్ జోత్ సింగ్ కు జీవితఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!