ADAS technology: ఇండియాలో కార్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. మధ్యతరగతి వర్గంలో కార్ల కొనుగోలు పెరిగింది. కోవిడ్ తర్వాత కార్ల కొనుగోలు ఊపందుకుంది. ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో కూడా ఇండియా దూసుకెళ్తోంది. దీంతో పాటు సీఎన్జీ, సంప్రదాయ పెట్రోల్, డిజిల్ కార్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. దీంతో అన్ని కార్ కంపెనీలు అన్ని ఫ్యూయల్ ఆప్షన్లతో తమ కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే కార్లను కంపెనీలు టెక్ లోడెడ్ గా మారుస్తున్నాయి. అన్ని రకాల టెక్నాలజీని అందించి ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి.
Read Also: Bengal Governor: ఎన్నికలు బ్యాలెట్లతో జరగాలి..బుల్లెట్లతో కాదు: బెంగాల్ గవర్నర్
ముఖ్యంగా ఇటీవల కాలంలో ADAS ( అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి కంపెనీలు. లాంగ్ డ్రైవ్ లో డ్రైవర్ కి సహాయపడే విధంగా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. డ్రైవింగ్ అనుభవాన్ని మరింతగా ఫన్ టూ డ్రైవ్ గా మారుస్తుంది. లాంగ్ డ్రైవ్, హైవేలపై వెళ్లే సమయంలో కార్ ఆటోమెటిక్ గా డ్రైవింగ్ చేసుకునేందుకు ఈ ADAS టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రంట్ కొలిషన్ వార్నింగ్(FCW), ముందు ప్రయాణిస్తున్న వాహనానికి కార్ గద్దుకునే రేంజ్ లోకి వచ్చిన సందర్భంలో డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. బ్లైండ్ స్పాట్ కొలిషన్(BCW), బ్లైండ్ స్పాట్ కొలిషన్ అవాయ్‌డెన్స్ అసిస్ట్(BCA), రేర్ క్రాస్ ట్రాఫిక్ కొటిషన్ వార్నింగ్( RCCW) వంటి సెక్యూరిటీ ఫీచర్లను అందించడానికి ADAS టెక్నాలజీ సహాయపడుతుంది. కార్లలో ఈ ADAS టెక్నాలజీ కెమెరాలు, రాడార్లను ఉపయోగించుకుని పనిచేస్తుంది.
దీంతో పాటు హైవేలపై వెళ్తున్న సమయంలో లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లతో వాహనం రోడ్డుపై సక్రమంగా వెళ్లడానికి సహాయపడుతాయి. ప్రస్తుతం పలు కంపెనీలు తమ మిడ్ రేంజ్ కార్లలో ఈ ఫీచర్లను తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ప్రస్తుతం పలు కంపెనీలు తమ కార్లలో ADAS ఫీచర్లను అందిస్తున్నాయి. టాటా తన హరియర్‌లో ఈ టెక్నాలజీతో నింపింది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, ఎంజీ అస్టర్, మహీంద్రా XUV700తో పాటు తాజాగా కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లో కూడా ఈ హైఎండ్ ఫీచర్ని అందిస్తోంది. రానున్న కాలంలో మిడ్ సైజ్ SUVల్లో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కార్ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.