Threads: ట్విట్టర్‌కి పోటీగా మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ దుమ్మురేపుతోంది. మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఒక్క రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క రోజులోనే 4 కోట్ల డౌన్‌లోడ్స్ జరిగాయి. ట్విట్టర్‌కి రాబోయే రోజుల్లో గట్టిపోటీ ఇవ్వబోతోంది. గత దశాబ్ధకాలంలో ఏ యాప్ కూడా ఇంతటి డౌన్‌లోడ్స్‌ని సొంతం చేసుకోలేదు. అన్నింటి రికార్డులను అధిగమించింది. ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్ తో పోలిస్తే ఆండ్రాయిడ్ మొబైల్‌లోనే యాప్ కి ఎక్కువ రెస్పాన్ వచ్చింది. ఏకంగా 75 శాతం ఆండ్రాయిడ్స్ ఫోన్స్ లోనే యాప్‌ని కలిగి ఉన్నారు.
Read Also: Vande Bharat Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రంగు మారింది చూశారా.. ఎంత బాగుందో !
ఇక ఇదిలా ఉంటే యాప్‌కి భారత్, బ్రిజిట్ బ్రహ్మరథం పట్టాయి. ముఖ్యంగా మొత్తం డౌన్‌లోడ్స్‌ని పరిశీలిస్తే 22 శాతం భారత్ లోనే నమోదయ్యాయి. 16 శాతం బ్రెజిల్ తర్వాతి స్థానంలో ఉంది. అమెరికాలో 5.5 శాతం డౌన్‌లోడ్స్ జరిగాయి. పోకీమాన్ జీఓ, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ వంటి ప్రముఖ గేమ్స్ రికార్డును థ్రెడ్స్ అధిగమించింది. ఈ రెండు గేమింగ్స్ యాప్స్ తొలిరోజుల్లో సుమారుగా 2 కోట్ల డౌన్ లోడ్స్ జరిగితే.. థ్రెడ్స్ మాత్రం ఒకే రోజులో 4 కోట్ల డౌన్‌లోడ్స్ ని సొంతం చేసుకుని మొదటిస్థానంలో నిలిచింది. అంతకుముందు ట్విట్టర్ కి పోటీగా ట్రంప్ తీసుకువచ్చిన ట్రూత్ సోషల్ 1,44,000 డౌన్‌లోడ్‌ల ఉంది. 96 శాతం థ్రెడ్స్ వినియోగదారులు యాక్టివ్ గా ఉన్నట్లు తేలింది.
సెన్సార్ టవర్స్ పరిశోధన ప్రకారం.. థ్రెడ్‌ల యూజర్ బేస్‌లో దాదాపు 68% మంది పురుషులు ఉన్నారు, 32% మంది స్త్రీలుగా ఉన్నారు. వయసు వారిగా చూస్తే 25-35 ఏళ్ల వయసు పురుషుల్లో 28 శాతం, 18-25 ఏళ్లలో 11 శాతం పరుషులు ఉంటే, స్త్రీలు 5 శాతం ఉన్నారు. 45 ఏళ్లకు పైబడిన వారిలో పురుషులు 3 శాతం ఉంటే, స్త్రీలు 2 శాతం ఉన్నారు.