Orissa High Court: సహజీవనంపై ఒరిస్సా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కలిసి ఉండీ సెక్స్ చేసుకుని వివాహం చేసుకుంటాననే వాగ్దానాన్ని ఉల్లంఘిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేం అని ఒడిశా హైకోర్టు వ్యాక్యానించింది. భువనేశ్వర్ కు చెందిన ఓ వ్యక్తి ఎదుర్కొంటున్న అత్యాచారం ఆరోపణల్ని కోర్టు కొట్టేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, కొన్నాళ్లు ఇద్దరు కలిసి ఉండీ, పరస్పర అంగీకారంతో శృంగారం కొనసాగించి, ఆ తరువాత వివాహం జరిగితే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
భర్తతో ఐదేళ్లుగా వివాదంలో ఉన్న ఒక యువతి, పిటిషనర్ కి స్నేహితురాలు. సదరు యువతి పిటిషనర్ పై అత్యాచార ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటాననే హామీ చిత్తశుద్ధితో ఇచ్చి ఆ తరువాత పెళ్లి చేసుకోకపోవడానికి, తప్పుడు వాగ్ధానానికి సూక్ష్మమైన తేడా ఉందని జస్టిస్ ఆర్కే పట్నాయక్ జూలై 3న తన తీర్పులో పేర్కొన్నారు. సదరు యువతి భర్తతో విడాకులు తీసుకోకుండా, ఒక వ్యక్తితో స్నేహం కారణంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న కేసులో ఈ తీర్పును హైకోర్టు వెలువరించింది. మహిళ తనపై మోపిన అత్యాచారం కేసును సవాల్ చేస్తూ ఆ వ్యక్తి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశాడు. ఇరువురు ఏడేళ్లపాటు సంబంధాన్ని కొనసాగించారు.
Read Also: Yatra-2 Motion Poster: నేను విన్నాను, నేను ఉన్నాను.. యాత్ర-2 మోషన్ పోస్టర్ రిలీజ్!
మొదట్లో స్నేహపూర్వకంగా మొదలై, తర్వాత సంబంధాన్ని పెంచుకున్నట్లయితే, అది ఎప్పుడు అపనమ్మకం, అల్లర్ల కారణంగా సదరు వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడిన ముద్ర వేయకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇద్దరు వ్యక్తులు కూడా విద్యావంతులై మంచిస్థానంలో ఉన్నారని, ఇందులోని పర్యవసానాలు బాగా తెలుసని, ఇద్దరు వేర్వేరుగా ఉంటూ బయటకి కనిపించినా.. వీరిద్దరి మధ్య సంబంధం ఏర్పడిందో అర్థమైందని జస్టిస్ పట్నాయక్ వ్యాఖ్యానించారు. పిటిషనర్ పై అత్యాచారం ఆరోపణలు చేయడం సమంజసం కాదని కోర్టు నిర్ణయానికి వచ్చింది.
బాధితురాలితో వివాహానికి హామీ ఇచ్చి ఇద్దరు వ్యక్తులు శారీరక సంబంధాన్ని కొనసాగిస్తే, కొన్ని కారణాల వల్ల అది కుదరకపోగా, వాగ్దానాన్ని ఉల్లంఘించారనే వాదనతో దానిని అత్యాచారంగా పేర్కొనలేమని సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఇదే విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది.