India vs Pakistan: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చంది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో ఈ రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. శ్రీలంక క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలో ఈ రోజు ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ఇరు జట్ల అభిమానులతో స్టేడియం పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు తన తొలి మ్యాచులో పసికూన నేపాల్ పై 238 పరుగుల తేడాతో గెలిచి ఊపులో ఉంది. కాగా భారత్ కు ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్.
ప్రతిష్టాత్మకంగా మారిన ఈ మ్యాచుపై ఇరు జట్లకు చెందిన మాజీ స్టార్ ఆటగాళ్లు తమ అంచనా వేస్తున్నారు. పాక్ స్పీడ్ స్టార్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుదే పై చేయిగా ఉంటుందని తేల్చేశారు. ముందుగా భారత్ బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడ్డట్టే అని అన్నారు. ఇదే విధంగా పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ కి దిగితే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవని అన్నారు.
Read Also: Singapore Presidential Election: సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి షణ్ముగరత్నం ఎన్నిక
బాబర్, అతని టీం చాలా పరిణితి క్రికెట్ ఆడుతున్నారని, వారు ఇంతకు ముందు భారత్ తో ఒత్తడితో కూడిన మ్యాచులు ఆడారని, ఇప్పుడు వారిపై పెద్దగా ఒత్తిడి ఉండదని అక్తర్ చెప్పుకొచ్చారు. ముందుగా టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంటే భారత్ ని చిత్తు చేస్తుందని అంచనా వేశాడు. భారత్ టాస్ గెలిస్తే పాక్ రెండో ఇన్నింగ్స్ ఆడితే ఫ్లడ్ లైట్ల వెలుగులో బాల్ ఎక్కువగా కదలకపోవడంతో పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడొచ్చని షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో అన్నారు.
బూమ్రా, షమీ, సిరాజ్ ముగ్గురు ఫేసర్లతో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో ఉండాలని అన్నారు. రెండు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయిని అన్నారు. విరాట్ కోహ్లీ 3 లేదా 4 వద్ద బ్యాటింగ్ చేయాలా, మరియు ఇషాన్ 5 వద్ద బ్యాటింగ్ చేయాలా లేదా ఇన్నింగ్స్ ప్రారంభించాలా అనే దానిపై చర్చ జరుగుతోందని, అయితే పాక్ పేస్ దళం బలంగా ఉందని, వారి బ్యాటింగ్ కూడా గతంలో కన్నా బలంగా ఉందని అన్నారు. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.