మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- భారత్‌లో సుజుకి హయాబుసా స్పెషల్ ఎడిషన్ లాంచ్
- స్పెషల్ ఎడిషన్ ధర రూ.19.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- అప్డేటెడ్ స్టాండర్డ్ హయాబుసా ధర రూ.18.99 లక్షలు
- పెర్ల్ విగర్ బ్లూ కలర్లో స్పెషల్ ఎడిషన్ అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suzuki Hayabusa Special Edition: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన ఫ్లాగ్షిప్ స్పోర్ట్స్ టూరింగ్ మోటార్‌సైకిల్ హయాబుసాలో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ స్టాండర్డ్ హయాబుసాతో పాటు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక గ్రాఫిక్స్, కొత్త వీల్ ఫినిష్, కాస్మెటిక్ అప్డేట్స్తో పాటు రైడర్లకు ఉపయోగపడే కొన్ని ఎలక్ట్రానిక్ మార్పులు ఇందులో ఉన్నాయి.
హయాబుసా స్పెషల్ ఎడిషన్ ధర రూ.19,90,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇక అప్డేటెడ్ స్టాండర్డ్ హయాబుసా ధర రూ.18,99,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.
Also Read
- BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
- TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
ప్రత్యేక లుక్
హయాబుసా స్పెషల్ ఎడిషన్‌ను పెర్ల్ విగర్ బ్లూ కలర్లో మాత్రమే అందిస్తున్నారు. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఇందులో ప్రత్యేక గ్రాఫిక్స్, కొత్త వీల్ ఫినిష్ ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్‌పై 3D సుజుకి ఎంబ్లమ్, స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్, మఫ్లర్ ఎండ్, హీట్ గార్డ్‌పై యానోడైజ్డ్ వివరాలు ఉన్నాయి. అంతేకాకుండా సింగిల్-సీట్ కౌల్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
మూడు కొత్త కలర్స్
స్పెషల్ ఎడిషన్‌తో పాటు స్టాండర్డ్ హయాబుసాను కూడా సుజుకి కొత్త కలర్ ఆప్షన్లతో అప్డేట్ చేసింది. అవి..
* క్యాండీ డేరింగ్ రెడ్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్
* మెటాలిక్ గెలాక్సీ గ్రే / క్యాండీ బర్న్ట్ గోల్డ్
* పెర్ల్ విగర్ బ్లూ / పెర్ల్ బ్రిలియంట్ వైట్
లిథియం-అయాన్ బ్యాటరీ
అప్డేటెడ్ హయాబుసాలో కొత్త ELIIY పవర్ లిథియం-అయాన్ బ్యాటరీను ఉపయోగించారు. ఇది గతంలో ఉన్న బ్యాటరీ కంటే తేలికగా, కాంపాక్ట్‌గా ఉంటుంది. లోడ్ సమయంలో మరింత స్థిరమైన వోల్టేజ్ అందిస్తుందని సుజుకి తెలిపింది. లాంచ్ కంట్రోల్ సిస్టమ్, పవర్ మోడ్ సెలెక్టర్ సెట్టింగ్స్‌ను కూడా కంపెనీ సవరించింది. స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్లో చేసిన మార్పు మరో ముఖ్యమైన అప్డేట్. ఇప్పుడు గేర్ మార్చే సమయంలో కూడా క్రూయిజ్ కంట్రోల్ యాక్టివ్‌గా కొనసాగుతుంది. దీంతో ఎంచుకున్న వేగాన్ని కొనసాగించేందుకు మళ్లీ థ్రాటిల్ ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
1,340cc ఇన్లైన్-4 ఇంజిన్
హయాబుసాలో ఎప్పటిలాగే 1,340cc లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్-4 ఇంజిన్ కొనసాగుతుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్, DOHC టెక్నాలజీతో పనిచేసే ఈ ఇంజిన్ వివిధ RPMల వద్ద బలమైన టార్క్ అందించేలా ట్యూన్ చేశారు. ఎగ్జాస్ట్ సౌండ్‌ను కూడా సుజుకి ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. స్టార్ట్ చేసినప్పుడు స్పోర్టీ సౌండ్‌తో పాటు సాధారణ రైడింగ్ సమయంలో రైడర్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఎగ్జాస్ట్ నోట్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
ప్రీమియం హార్డ్‌వేర్
హయాబుసాలో ట్విన్-స్పార్ అల్యూమినియం ఫ్రేమ్, స్వింగార్మ్ కొనసాగుతున్నాయి. ముందు భాగంలో అడ్జస్టబుల్ KYB ఇన్వర్టెడ్ ఫోర్క్స్ ఉన్నాయి. బ్రిడ్జ్‌స్టోన్ Battlax Hypersport S22 టైర్లను ఉపయోగించారు. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో Brembo Stylema కాలిపర్లు, ట్విన్ 320mm ఫ్లోటింగ్ డిస్కులు ఉన్నాయి. అధిక వేగాల్లో స్టెబిలిటీ, రైడర్ కంఫర్ట్ మెరుగ్గా ఉండేలా హయాబుసా బాడీవర్క్‌ను విస్తృత విండ్-టన్నెల్ టెస్టింగ్ ద్వారా అభివృద్ధి చేశారు.
హయాబుసాలో అనేక ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్ ఉన్నాయి. ఇందులో..
* మోషన్ ట్రాక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
* బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్
* సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్
* లో RPM అసిస్ట్
* స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ సిస్టమ్
* ఫుల్ LED లైటింగ్
సుజుకి హయాబుసా స్పెషల్ ఎడిషన్, అప్డేటెడ్ స్టాండర్డ్ హయాబుసా రెండూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారుల కోసం సుజుకి జెన్యూన్ యాక్సెసరీస్‌తో పాటు హయాబుసా బ్రాండెడ్ రైడింగ్ గేర్‌ను కూడా అందిస్తున్నారు.
Same legend. New expressions.
The legendary Hayabusa is about to make a statement in more colours.
Stay tuned.#SuzukiIndia #SuzukiMotorcycle #Hayabusa pic.twitter.com/X98P0Zsg0A— Suzuki Motorcycle India (@suzuki2wheelers) September 28, 2026
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!