CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ అత్యంత ఉత్సాహంగా, జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర క్యాడర్లో కనిపిస్తున్న జోష్‌ను బట్టి చూస్తే, ఏపీలో ఎన్డీయే (NDA) హవా రాబోయే కాలంలోనూ ఇలాగే కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. మహిళలు సైతం పంచాయతీ ఎన్నికలకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.
2024 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని శాఖల్లోనూ మార్పులు తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. నాటి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, గత పాలనలో రోడ్లు పూర్తిగా దారుణంగా ఉండేవని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా దొరకని దుస్థితి ఉండేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
Also Read
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
ప్రస్తుతం తన సుదీర్ఘ అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుషారు, కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. పంచాయతీ రాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ముద్ర వేసి విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందని కొనియాడారు.
రాష్ట్రంలో ఏకంగా రూ.11 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని సీఎం తెలిపారు. ప్రజలు ఎన్డీయే కూటమికి వేసిన ప్రతి ఒక్క ఓటు కూడా వృథా కాలేదని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వంద శాతం నిలబెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం మరింత వేగంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!