Black hole: సూర్యుడి లాంటి నక్షత్రాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తినేస్తున్న బ్లాక్ హోల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Black hole: బ్లాక్ హోల్స్.. విశ్వంలో ఎంతటి వస్తువైనా దీన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సెకన్‌కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్లే కాంతి కూడా ఈ దట్టమైన బ్లాక్ హోల్స్ నుంచి తప్పించుకోలేదు. శాస్త్రవేత్తలు మనకు సమీపంలో ఉండే ఒక గెలాక్సీలో మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ ని గుర్తించారు. ఇది సూర్యుడి పరిమాణం ఉన్న ఓ నక్షత్రాన్ని కబలిస్తోంది. నక్షత్రం ఈ బ్లాక్ హోల్ కి దగ్గరగా వచ్చినప్పుడు ప్రతీసారి భూమి ద్రవ్యరాశి కంటే మూడు రెట్ల పదార్థాన్ని తినేస్తోంది. ‘రిపీటింగ్ పార్షియల్ టైడల్ డిస్ట్రప్షన్’ అని పిలిచే ఈ పరిణామం బ్లాక్ హోల్ కి బ్రేక్‌ఫాస్ట్ గా ఉంటుంది.
బ్లాక్ హోల్స్ సాంద్రత, గురుత్వాకర్షణ శక్తి నక్షత్రాలతో పోలిస్తే కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. తాజాగా కనుగొన్న ఈ కృష్ణబిలం సౌరవ్యవస్థ నుంచి 520 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఒక కాంతి సంవత్సరం అంటే సెకన్ కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ఏడాదికి ఎంతదూరం ప్రయాణిస్తుందో అంత దూరం అన్నమాట. ఏడాదిలో కాంతి 9.5 ట్రిలియన్ కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
Read Also: Smoking: స్మోకింగ్ చేస్తున్నారా..? అయితే తొందరగా ముసలివాళ్లు అవ్వడం ఖాయం.. షాకింగ్ స్టడీ..
ఈ బ్లాక్ హోల్ చిన్నదని. అంచనా ప్రకారం సూర్యుడి కన్నా వందల వేట రెట్లు పెద్దది. కొన్ని గెలాక్సీల్లో మాసీవ్ బ్లాక్ హోల్స్ ఉంటాయి. ఇవి సూర్యుడితో పోలిస్తే కొన్ని వేల మిలియన్ల పెద్దగా ఉంటాయి. మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో సజ్జరేటియస్-ఏ అనే అతిపెద్ద బ్లాక్ హోల్ ఉంది. మన సూర్యుడితో పోలిస్తే 4 మిలియన్ రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉంొది.
బ్లాక్ హోల్స్ ధాటికి గురయ్యే నక్షత్ర పదార్థం 3.6 మిలియన్ డిగ్రీల ఫారెన్ హీట్ (2 మిలియన్ డిగ్రీల సెల్సియస్) వరకు వేడెక్కుతుంది, భారీ మొత్తంలో ఎక్స్-కిరణాలను విడుదల చేస్తుంది. వీటిని నాసా కక్ష్యలో ఉన్న నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ గుర్తించింది. పరిశోధకుల్లో ఒకరైన ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ రాబ్ ఐల్స్-ఫెర్రిస్ మాట్లాడుతూ.. నక్షత్రం కక్ష్య క్రమంగా క్షీణిస్తోందని, నక్షత్రం పూర్తిగా నాశనం అవ్వడానికి కొన్ని ఏళ్లు పట్టొచ్చని అన్నారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!