Earth Like Planet: విశ్వం అంతా మహాసముద్రం అనుకుంటే ఇప్పటి వరకు మనకు తెలిసింది కేవలం ఒక నీటి చుక్క మాత్రమే. ఇంత పెద్దదైన బ్రహ్మాండంలో భూమిలాంటి గ్రహాలు లక్షల్లో ఉన్నా కూడా వాటిని మనం గుర్తించలేము. ఎందుకంటే మన సూర్యుడు ఉన్న మిల్కీవే గెలాక్సీలోనే కొన్ని మిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. మిల్కీవే గెలాక్సీని దాటాలంటేనే కొన్ని వేల ఏళ్ల కాంతి సంవత్సాల సమయం పడుతుంది. అలాంటిది ఈ విశ్వంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి.
అయితే శాస్త్రవేత్తలు మాత్రం భూమి లాంటి గ్రహాలను కనుగొనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కొన్ని వందల సంఖ్యలో ఎక్సో ప్లానెట్లను కనుగోన్నారు. అయితే తాజాగా K2-18 b అనే భూమి లాంటి గ్రహాన్ని గురించి శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. భూమికి 120 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కూల్ మరుగుజ్జు నక్షత్రం K2-18 చుట్టూ తిరుగుతోంది. ఈ గ్రహం కూడా భూమిలాగే నివాసయోగ్యమైన జోన్ లో ఉంది. భూమితో పోలిస్తే దాదాపుగా 8.6 రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉంది. ఈ గ్రహం మొత్తం మహాసముద్రాలతో నిండిపోయి ఉంది.
Read Also: Uddhav Thackeray: రామమందిర సమయంలో “గోద్రా” తరహా ఘటన.. స్పందించిన బీజేపీ
నాసాకు చెందిన జెమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ గ్రహానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. మిథేన్, కార్బన్ డయాక్సైడ్ సహా కార్బన్ బేరింగ్ అణువుల ఉనికిని వెల్లడించింది. ఈ గ్రహం హైసియన్ ఎక్సోప్లానెట్ కావచ్చని, హైడ్రోజన్ అధికంగా ఉండే వాతావరణంలో నీటి సముద్రంతో కప్పబడిన ఉపరితలం కలిగిన ఒక రకమైన గ్రహమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
భూమి-నెఫ్ట్యూన్ మధ్య పరిమాణం కలిగిన ఈ ‘సబ్-నెఫ్ట్యూన్’ మన సౌరవ్యవస్థ గ్రహాలకు భిన్నంగా ఉంటాయి. అయితే ఈ గ్రహం గురించి పూర్తిగా తెలియాల్సి ఉంది. K2-18 b గ్రహంపై కార్బన్ బేరింగ్ అనువులు ఉండటం పరిశోధకులకు ఆసక్తి రేకెత్తిస్తోంది. హైడ్రోజన్ రిచ్ వాతావరణంలో నీటి సముద్రాలు ఉండే అవకాశం ఉందని, భూమిపై జీవానికి కారణమైన డైమిథైల్ సల్ఫైడ్(డీఎంఎస్) ఉండే అవకాశాలకు మద్దతు ఇస్తుందని పరిశోధకులు తెలిపారు.