Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా సర్వే పిటిషన్‌ని కొట్టేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Janmabhoomi: ఉత్తర్ ప్రదేశ్ మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతాన్ని సర్వే చేయాలిన నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సమస్యను అలహాబాద్ హైకోర్టు నిర్ణయానికి వదిలివేసింది. దీనిపై దాఖలైన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు విచారిస్తోంది. ఈ వివాదంపై దాదాపు 10 పిటిషన్లు అలహాబాద్ హైకోర్టు దాఖలైనట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
అలహాబాద్ హైకోర్టులో ఈ సమస్య పెండింగ్ లో ఉన్నందున మేము మా అధికార పరిధిని ఉపయోగించాల్సిన అవసరం లేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని మే 26న హై కోర్టు నిర్ణయించింది. రంజనా అగ్నిహోత్రి అనే న్యాయవాది ఈ సమస్యపై పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి.
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
Read Also: Uttar Pradesh: ఆన్‌లైన్ లో పరిచయమైన అమ్మాయిని కాల్చిచంపిన వ్యక్తి..
కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా భూవివాదానికి సంబంధించి పలు దావాలు మధురలోని కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్నాయి. మసీదులోని 13.37 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. శ్రీకృష్ణ ఆలయం, షాహీ ఈద్గా పక్కపక్కనే ఉన్నాయి. 1968లో మసీదు కమిటీ, శ్రీకృష్ణజన్మస్థాన్ సేవా సంఘ్ మధ్య జరిగిన రాజీని రద్దు చేయాలని పలు పిటిషన్లు కోరాయి. మసీదు ఉన్న స్థలంలోనే కంటిన్యూ అయ్యేలా ఒప్పందం కుదిరింది. అయితే ఒక్క అయోధ్య రామజన్మభూమి మినహాయించి ఆగస్టు 15, 1947 నాటికి ఉన్న ప్రార్థన స్థలాలను రక్షించేందుకు ఉద్దేశించిన ప్రార్థన స్థలాల చట్టం ప్రకారం అన్ని పిటిషన్లు నిషేధించబడతాయని మసీదు కమిటీ వాదిస్తోంది.
తాజావార్తలు
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..