Tata Punch EV: ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో ఇండియాలోనే టాటా తోపుగా ఉంది. టాటా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌ని పరిశీలిస్తే దీని దరిదాపుల్లో కూడా ఇతర కార్లు లేవు. ఇప్పటికే టాటా నుంచి టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ కార్లు ఉన్నాయి. ఇండియాలోనే నెక్సాన్ ఈవీ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఇప్పటికే టాటాలో హ్యచ్ బ్యాక్ సెగ్మెంట్ లో టియాగో ఈవీ, సెడాన్ లో టిగోర్ ఈవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీలో నెక్సాన్ ఈవీ ఉంది. అయితే ఇప్పుడు మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్ లో పంచ్ ఈవీని తీసుకురాబోతోంది.
Read Also: Chandrayaan 3: ల్యాండర్, రోవర్ నుండి అందని సిగ్నల్.. ఇస్రో తాజా అప్‌డేట్
వచ్చే నెలలో పంచ్ ఈవీ లాంచ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పంచ్ ఈవీని పరీక్షిస్తున్న చాలా ఫోటోలు బయటకు వచ్చాయి. కొత్తగా వచ్చే పంచ్ ఈవీలో కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం నెక్సాన్ ఈవీ ఫెస్‌లిఫ్ట్ లో ఉన్న విధంగానే పంచ్ లో కూడా పెద్ద 10.25 ఇంచ్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. పంచ్ ఈవీకి ఛార్జింగ్ సాకెట్ ముందు భాగంలో ఉంది. టాటా ఈవీ కార్లలో ఉన్న విధంగానే జిప్‌ట్రాన్ టెక్నాలజీని పంచ్ ఈవీలో కూడా ఉపయోగిస్తుంది.
ప్రస్తుతం పంచ్ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. తాజాగా ఎలక్ట్రిక్ వేరియంట్ లో కూడా లాంచ్ కాబోతోంది. 360 కెమెరా లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉండే ఛాన్స్ ఉంది. పర్మినెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్, లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఉన్న సమాచారం ప్రకారం 300 కిలోమీటర్ల రేంజ్ తో పంచ్ వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 19.2kWh, 24kWh బ్యాటరీ సెటప్ తో రావచ్చు. మరోవైపు హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎలక్ట్రిక్ మోడల్ ని పరీక్షిస్తోంది.