Nitin Gadkari: ఈ ఏడాది చివరకల్లా దేశంలోని జాతీయ రహదారులపై గుంతలు లేకుండా చేస్తామని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిష్ గడ్కరీ చెప్పారు. ఇందుకోసం కేంద్రం ప్రత్యేక విధివిధానాలను సిద్ధం చేస్తున్నందని వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని 1,46,000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల మ్యాపింగ్ పూర్తైందని తెలిపారు. ఏడాది చివరి నాటకిి గుంతలను తొలగించేందుకు పర్ఫామెన్స్ బెస్డ్ మెయింటనెన్స్, స్వల్పకాలిక నిర్వహణ ఒప్పందాలను పటిష్టం చేస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల కార్యదర్శి అనరాగ్ జైన్ తెలిపారు.
Uttar Pradesh: దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చివరకు అభంశుభం తెలియని చిన్నారులు కూడా కామాంధుల అఘాయిత్యాలకు బలైపోతున్నారు. ఇప్పటికే ఉజ్జయినిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లోని అలీఘర్ ప్రాంతంలో ఏడేళ్ల బాలిపై అత్యాచారం చేసి హత్య చేశాడు.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కార్పెంటర్ అవతారం ఎత్తారు. ఇటీవల పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ సామాన్య ప్రజానీకంతో మమేకం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూలీగా మారి సూట్‌కేస్ నెత్తిన పెట్టుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా గురువారం రోజు ఆసియాలో అతిపెద్ద ఫర్నీచర్ మార్కెట్ అయిన ఢిల్లీలోని కీర్తీనగర్ మార్కెట్ లో కార్మికులు, కార్పెంటర్లతో ముచ్చటించారు. మార్కెట్ సందర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
Ujjain Case: ఉజ్జయిని అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. 15 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. తీవ్ర గాయాలతో రక్తం కారుతూ, అర్ధనగ్నంగా సాయం కోసం ధీనంగా బతిమిలాడుతున్న వీడియో వైరల్ గా మారింది. ఓ ఇంటి ముందుకు వెళ్లి సాయం కోరం సదరు వ్యక్తి తరిమివేయడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. బాలిక పరిస్థితిని చూసి పలువురు రూ.50,100 ఇవ్వడానికి ప్రయత్నించారు. చివరకు ఓ పూజారి బాలిక పరిస్థితిని చూసి కొత్త బట్టలు ఇచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
Mobile Usage: ఇటీవల కాలంలో పిల్లల్లో మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. అన్నం తినడానికి మారం చేస్తున్నారనో..తమ పనులకు ఆటంకం కలిగిస్తున్నారో తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లను ఇస్తున్నారు. అయితే ఇదే అలవాటుగా మారి పిల్లలు దానికి అడిక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పిల్లలు ఫిజికల్ గేమ్స్ ఆడేందుకు ఇష్టపడటం లేదు, స్కూల్ నుంచి వచ్చిందంటే చాలు సెల్ ఫోన్లపై పడుతున్నారు. యూట్యూబ్, గేమ్స్ ఇలా వాటితో కాలక్షేపం చేస్తున్నారు.
Canada: కెనడా ఆర్మీ వెబ్సైట్ పై భారత హ్యకర్తు దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కెనడా ఆర్ముడ్ ఫోర్సెస్ అధికారిక వెబ్సైట్ బుధవారం తాత్కాలికంగా నిలిపేవారు. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఈ వెబ్సైట్ పై ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ అనే హ్యకర్ల టీం హ్యాక్ చేసింది, దీనికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రకటించిందని తెలిపింది.
Uttar Pradesh: కూతురు పెళ్లి కోసం ఓ తల్లి దాచుకున్న డబ్బులన్నీ చెదలు పట్టాయి. ఏకంగా రూ.18 లక్షలని చెదలు మాయం చేశాయి. ఒక్క రూపాయి కూడా లేకుండా చెదలు మొత్తం డబ్బుల్ని కొట్టాయి. అయితే ఇదంతా బాధితురాలు ఇంట్లో కాదు. బ్యాంకు లాకర్ లో ఉన్న డబ్బులకు చెదలు పట్టాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొరాదాబాద్‌లో జరిగింది.
Punjab: పంజాబ్‌లో ఓ వ్యక్తి కడుపులో ఉన్న వస్తువులను చూసి అవాక్కవ్వడం డాక్టర్ల వంతైంది. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కడుపులో ఏకంగా తాళాలు, ఇయర్ ఫోన్స్, బోల్టులు, నట్స్, వాషర్లు ఇలా అనేక వస్తువులను డాక్టర్లు గుర్తించారు. గత రెండేళ్లుగా సదరు వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. కడుపునొప్పి, జ్వరం, వాంతులు ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతుూ ఇటీవల మోగాలోని మెడిసిటీ ఆస్పత్రికి వచ్చాడు.
Vivek Ramaswamy: అమెరికన్ అధ్యక్ష ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ మొదలైంది. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో పోటీ రసవత్తరంగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలి వంటి వారు అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీలో నిలబడ్డారు. అయితే ట్రంప్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉన్నారు.
Jharkhand: జార్ఖండ్ లో పాకూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏకంగా 110 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని గురువారం అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్తులు వాంతులు, తలనొప్పిగా ఉందని ఫిర్యాదు చేశారు. భోజనంలో బల్లి పడటంతోనే ఇలా అయిందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.