Uttar Pradesh: కూతురు పెళ్లి కోసం పొదుపు చేస్తే.. రూ.18 లక్షలను మాయం చేసిన చెదలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: కూతురు పెళ్లి కోసం ఓ తల్లి దాచుకున్న డబ్బులన్నీ చెదలు పట్టాయి. ఏకంగా రూ.18 లక్షలని చెదలు మాయం చేశాయి. ఒక్క రూపాయి కూడా లేకుండా చెదలు మొత్తం డబ్బుల్ని కొట్టాయి. అయితే ఇదంతా బాధితురాలు ఇంట్లో కాదు. బ్యాంకు లాకర్ లో ఉన్న డబ్బులకు చెదలు పట్టాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొరాదాబాద్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్లే మొరాదాబాద్ కి చెందిన అల్కా పాఠక్ గతేడాది అక్టోబర్ నెలలో బ్యాంకు ఆఫ్ బరోడా ఆషియానా బ్రాంచులో తన లాకర్ లో రూ.18 లక్షలు ఉంచింది. అయితే ఇటీవల లాకర్ అగ్రిమెంట్ రిన్యూవల్ చేసుకోవడానికి బ్యాంకుకి రావాల్సిందిగా బ్యాంకు అధికారులు ఆమెను కోరారు. ఈ నేపథ్యంలో తన లాకర్‌లో అన్నీ కరెక్టుగా ఉన్నాయో లేదో అని చెక్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read
Read Also: Punjab: వ్యక్తి కడుపులో ఇయర్ ఫోన్స్, తాళాలు.. అవాక్కైన వైద్యులు..
తన కూతురు పెళ్లి కోసం ఎంతో కష్టపడి పొదుపు చేసిన డబ్బు దుమ్ముగా మారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో బ్యాంకు అధికారులు కూడా షాక్ కి గురయ్యారు. ఈ ఉదంతంపై బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపినట్లు తెలిపారు. అయితే బ్యాంకు అధికారులు తనతో ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పాఠక్ ఆరోపించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుంటే మీడియాకు ఎక్కుతానని చెప్పారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం.. బ్యాంకు లాకర్లలో ఎలాంటి నగదును నిల్వ ఉంచకూడదు. బ్యాంకు ఒప్పందంలో ‘‘ నగలు, విలువైన వస్తువులు, పత్రాలు ఉంచడానికి మాత్రమే లాకర్ ని ఉపయోగించాలి, కానీ నగదు లేదా కరెన్సీ నిల్వ చేయడానికి కాదు’’ అని నిబంధలను పేర్కొన్నాయి. దొంగతనం, దోపిడి కారణంగా లాకర్ లోని వస్తువులు కోల్పోతే , అగ్నిప్రమాదం, భవనాలు కూలిపోయినప్పుడు, మోసం జరిగినప్పుడు మాత్రమే లాకర్ కి ఏడాదికి చెల్లించే మొత్తానికి 100 రెట్లు పరిహారం ఇస్తుందని, బ్యాంక్ బాధ్యత వహిస్తుందని బ్యాంక్ వెబ్‌సైట్ పేర్కొంది.
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!