Vivek Ramaswamy: ట్రంప్ దారిలో వివేక్ రామస్వామి.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Ramaswamy: అమెరికన్ అధ్యక్ష ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ మొదలైంది. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో పోటీ రసవత్తరంగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలి వంటి వారు అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీలో నిలబడ్డారు. అయితే ట్రంప్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉన్నారు.
ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలతో వివేక్ రామస్వామి వార్తల్లో నిలుస్తున్నారు. ట్రంపుకు మద్దతు ప్రకటిస్తూ ఈ దశాబ్ధంలో అత్యుత్తమ ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇదే కాకుండా తాను అధ్యక్షుడినైతే యూఎస్ క్యాపిటల్ ఆందోళనకారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తా అని చెప్పడంతో పాటు హెచ్1బీ వీసా పాలసీని సమీక్షిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
Read Also: Lizard In Meal: స్కూల్ భోజనంలో బల్లి.. 110 మంది విద్యార్థులకు అస్వస్థత
తాజాగా ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ కి మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. గతంలో ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నియంత అయినందు వల్ల ఉక్రెయిన్ మంచిదని అర్థం కాదని రామస్వామి అన్నారు. ఉక్రెయిన్ 11 ప్రతిపక్ష పార్టీలను నిషేధించిన దేశమని ఆయన అన్నారు. కాలిఫోర్నియా సిమి వ్యాలీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఇదే రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంపు కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్త పరిచారు. తాను అధ్యక్షుడినైతే వెంటనే రష్యా-ఉక్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలి వంటి వారు రామస్వామి వ్యాఖ్యలను తప్పుపట్టారు.
భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, రామస్వామి వ్యాఖ్యల్ని ఖండించారు. రష్యా విజయం చైనా విజయమని ఆమె అన్నారు. అయితే రామస్వామి మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఒప్పుకోలేదు. చైనా మనకు నిజమైన శతృవని, మనమే రష్యాను చైనా చేతుల్లో పెడుతున్నామని, దీన్ని అంతం చేయాలంటే సహేతుకమైన శాంతి ప్రణాళిక అవసరమని ఆయన అన్నారు. రామస్వామి వ్యాఖ్యల్ని మైక్ పెన్స్ కూడా తప్పపట్టారు. ‘‘వివేక్ మీరు పుతిన్ కి ఉక్రెయిన్ లో మద్దతిస్తే, చైనా తైవాన్ ని ఆక్రమించుకునేందుకు పచ్చజెండా ఊపినట్లే అని, బలం ద్వారా మాత్రమే శాంతి వస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!