Ujjain Case: ఉజ్జయిని అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. 15 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. తీవ్ర గాయాలతో రక్తం కారుతూ, అర్ధనగ్నంగా సాయం కోసం ధీనంగా బతిమిలాడుతున్న వీడియో వైరల్ గా మారింది. ఓ ఇంటి ముందుకు వెళ్లి సాయం కోరం సదరు వ్యక్తి తరిమివేయడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. బాలిక పరిస్థితిని చూసి పలువురు రూ.50,100 ఇవ్వడానికి ప్రయత్నించారు. చివరకు ఓ పూజారి బాలిక పరిస్థితిని చూసి కొత్త బట్టలు ఇచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో ఆటో డ్రైవరైన ప్రధాన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కస్టడీలో ఉన్న అతను తప్పించుకునేందుకు పయత్నించాడు, దీంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. కేసు రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితుడు పారిపోవాలని చూసినట్లు పోలీసులు చెప్పారు. ఘటన స్థలంలో ఆధారాలు సేకరించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: Mobile Usage: మొబైళ్లకు అతుక్కుపోతున్న పిల్లలు.. రోజుకు 4 గంటలు సెల్‌ఫోన్ లోనే..
ఘటనా స్థలంలో బాలిక ధరించిన దుస్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు భరత్ సోని తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీస్ సిబ్బంది వెంటాడి పట్టుకున్నారని, ఆ సమయంలో నిందితుడు సిమెంట్ రోడ్డుపై పడిపోవడంతో గాయాలయ్యాయని పోలీస్ అధికారి అజయ్ కుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడి జాడ కోసం సాంకేతిక నిఘాను ఉపయోగించామని, సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించామని ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.
నిందితుడు ఉజ్జయినికి చెందిన వాడని, బాలిక ఒంటరిగా నడుకుంటూ వెళ్లడాన్ని చూశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఎలాంతటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, ఆస్పత్రిలో కోలుకుంటుందని సచిన్ శర్మ వెల్లడించారు. ఈ కేసులో నిన్న మరో ఆటో రిక్షా డ్రైవర్ని ప్రశ్నించినట్లు తెలిపారు. ఆటోలో ఉన్న రక్తపు నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు చెప్పారు. అయితే ఈ సంఘటన గురించి పోలీసులకు తెలియజేయకపోవడంతో సదరు ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.