Birthday Party: బర్త్ డే వేడులకు చాలా గ్రాండ్‌గా జరపాలని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. క్యాండిల్స్, ఫోమ్ కారణంగా కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా బెంగళూర్‌లో ఓ బర్త్ డే వేడుకల్లో తృటిలో ప్రాణాపాయం తప్పింది. బెలూన్లు పేలి నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
Read Also: Rajinikanth: సంక్రాంతి బరిలో ‘లాల్ సలాం’.. వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
బెంగళూర్‌లోని బేలత్తూర్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా బెలూన్లను ఏర్పాటు చేశారు. ఇవి విద్యుత్ తీగలకు తగిలి పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన పిల్లల వయసు 2 నుంచి 8 ఏళ్లు ఉన్నాయి.
బెలూన్లను ఇంటి మెట్లపై ఉంచారు. ఇవి విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. చిన్నారులకు కాలిన గాయాలు కాగా, వీరిని విక్టోరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటల్లో గాయపడిన వ్యక్తిని 44 ఏళ్ల విజయ్ ఆదిత్యగా గుర్తించారు. అతని 7 ఏళ్ల కుమార్తెతో పాటు 3 ఏళ్ల కొడుకుకు గాయాలయ్యాయి. ఆదిత్య తన కూతురు పుట్టిన రోజును జరిపే క్రమంలో ఈ ఘటన జరిగింది.