Covid-19: కోవిడ్ 19 గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. వ్యాక్సినేషన్ డెవలప్ చేసినా కూడా రూపాలు మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే కోవిడ్ 19 దీర్ఘకాలంలో పలు సమస్యలకు కారణమవుతోంది. మెదడు, జట్టు రాలడం, అంగస్తంభన వంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాణాంతక ప్రియాన్ వ్యాధికి కూడా కారణం అవుతోందని, కోవిడ్ 19తో సంబంధం ఉందనే అనుమానం కలుగుతోంది.
అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ ప్రకారం.. 62 ఏళ్ల వ్యక్తి న్యూయార్క్ లోని మౌంట్ సినాయ్ క్వీన్స్ హాస్పిటల్ సెంటర్‌లో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. క్రమక్రమంగా చిత్త వైకల్యం(డెమెన్షియా) వంటి లక్షణాలను చూపించాడు. కోవిడ్ 19 పాజిటిల్ తర్వాత ఆయన నాడీ సంబంధిత పనితీరు క్షీణించిందని పేర్కొంది. రోగికి చివరకు ప్రియాన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అయితే కోవిడ్ 19 దీనికి కారణమైందా..? అనే అనుమానం కలుగుతోంది.
Read Also: Birthday Party: బర్త్ డే వేడుకలో పేలిన బెలూన్లు.. నలుగురు చిన్నారులకు గాయాలు..
రోగికి మెదడు పనితీరు పరిశీలించేందుకు సీటీ, ఎంఆర్ఐ స్కాన్లు నిర్వహించారు. అయితే ఈ రెండు పరీక్షలను రెండు సార్లు నిర్వహించారు. అయితే వీటిలో ఎలాంటి వ్యాప్తి లేకుండా నార్మల్ గానే ఉన్నాయి. అయినప్పటికీ అతని పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఆస్పత్రిలో చేరిన 3 వారాల తర్వాత రోగి క్రమంగా మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు, మెత్తని ఆహారాన్ని తినడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. 6 వారాల తర్వాత రోగి మరణించాడు. ఈ నివేదికలో వైద్యులు కోవిడ్, న్యూరోడెజెనరేటివ్ పరిస్థితుల మధ్య సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు.
ప్రియాన్ వ్యాధి అరుదైన న్యూరోడెజనరేటివ్ డిజార్డర్. ఇది మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలికంగా నాడీకణాల నష్టంతో సంబంధం ఉన్న లక్షణమైన స్పాంజిఫార్మ్ మార్పులను, వాపును ప్రేరేపిస్తుంది. దీంతో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. నడకలో మార్పులు, భ్రాంతి, కన్ఫ్యూషన్, కండరాల ధడత్వం తగ్గడం, అలసట, మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ తర్వాత ప్రియాన్ వ్యాధితో రోగి మరణించడం ఇది మొదటిసారి కాదని నివేదికలో వైద్యులు తెలిపారు. కోవిడ్ సోకిన తర్వాత ముగ్గురు రోగుల్లో ఇలా జరిగిందని తెలిపారు.