India Vs Pakistan: ఆసియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ జట్టు సైకిల్ స్టాండ్‌ని తలపించింది. 19.1 ఓవర్లలో కేవలం 146 రన్స్‌కి ఆలౌట్ అయింది. ఓపెనర్లు సరైన ఆరంభం ఇచ్చినప్పటికీ మిగతా బ్యాటర్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాక్ జట్టు నడ్డి విరిచాడు. వరుణ్ చక్రవర్తి (2), అక్షర్ పటేల్ (2), జస్ప్రీత్ బుమ్రా (2) ఇతర వికెట్లు పడగొట్టారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మావోల నుంచి కాల్పులు విరమణ ప్రతిపాదన వచ్చిన తర్వాత, ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కాల్పుల విరమన ప్రసక్తే లేని ఆదివారం అన్నారు. శాంతిని కోరుకునే వారు వెంటనే లొంగిపోవాలనే హెచ్చరికలు జారీ చేశారు.
Sonam Wangchuk: రాష్ట్ర హోదా కోసం ఇటీవల కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ అట్టుడికింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టడంతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది, వాహనాలపై దాడులు జరిగాయి. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో మంది గాయాలపాలయ్యారు.
US-Venezuela War: అమెరికా, వెనిజులా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యూఎస్ తమపై దాడి చేస్తుందని వెనిజులా భావిస్తోంది. అదే సమయంలో ఏ దాడికైనా సిద్ధంగా ఉండాలని వెనుజులా తన ప్రజలకు సూచించింది. ఇప్పటికే వెనిజులా తీర ప్రాంతంలో అమెరికా ఆర్మీ కదలికలు పెరిగాయి,
CM Yogi: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం పెద్ద ఎత్తున అల్లర్లకు కారణమైంది. రెండు రోజుల క్రితం శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లిం మూక రాళ్ల దాడికి పాల్పడింది.
Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడం, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ అధికారంలోకి రావడంతో అక్కడి మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. భారత్ టార్గెట్‌గా విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, బంగ్లాదేశ్ జమాతే ఇస్తామీ డిప్యూటీ లీడర్ అమీర్ సయ్యద్ అబ్దుల్లా మహ్మద్ తాహెర్ ‘‘ఘజ్వా-ఎ-హింద్’’ గురించి మాట్లాడుతూ,
TVK Rally Stampede: తమిళ స్టార్ ,టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజకీయం విమర్శలు ప్రతివిమర్శలకు కారణమవుతోంది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. విజయ్ ర్యాలీలో విద్యుత్ అంతరాయం, అకాస్మత్తుగా జనసమూహం, ఇరుకైన స్థలం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
India-China: అమెరికన్ సుంకాలు, ట్రంప్ తీరుతో భారత్, చైనాలు తమ సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చైనాలో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశంలో మోడీ, జిన్ పింగ్ మధ్య సమావేశాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ప్రధాని మోడీకి చైనా ఘన స్వాగతం పలికింది. ఇదే సమయంలో పుతిన్, మోడీ, జిన్ పింగ్ ఉన్న ఫోటో వైరల్‌గా మారింది.
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుగ్రహం కోసం తాపత్రయపడుతున్నారు. ఆరేళ్ల తర్వాత, తొలిసారిగా పాకిస్తాన్‌తో అమెరికా ద్వైపాక్షిక చర్చలు నిర్వహించింది. రెండు దేశాల సంబంధాలు బలపడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒకే కారణం కనిపిస్తోంది. పాకిస్తాన్‌లోని అరుదైన ఖనిజాలపై అమెరికా కన్నేసింది. అమెరికా ఆశలకు అనుగుణంగా పాకిస్తాన్ కూడా పనిచేస్తోంది. ముఖ్యంగా, రేర్-ఎర్త్ ఖనిజాలపై అమెరికా దృష్టి సారించిన నేపథ్యంలో, ఇటీవల వైట్ హౌజ్‌లో […]
Stampede: తమిళనాడు కరూర్‌లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, అధికార డీఎంకే పార్టీ నేతలు విజయ్‌పై విరుచుకుపడుతున్నారు. పోలీసు నిబంధనలు పాటించలేదని, మార్గదర్శకాలను ఉల్లంఘించారని మండిపడుతున్నారు. ఈ విషాద ఘటనలో 40 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు.