Sonam Wangchuk: రాష్ట్ర హోదా కోసం ఇటీవల కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ అట్టుడికింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టడంతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది, వాహనాలపై దాడులు జరిగాయి. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో మంది గాయాలపాలయ్యారు. అయితే, ఈ అల్లర్లను ప్రేరేపించారనే అభియోగంపై లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడికి పాకిస్తాన్ గూఢచారితో సంబంధాలు ఉన్నాయని తేలింది. ఇప్పటికే, ఆయనకు సంబంధించిన ఎన్జీవోల్లో విదేశీ నిధుల అక్రమాలు జరిగాయని కేంద్రం విచారణ ప్రారంభించింది.
Read Also: US-Venezuela War: ఆయుధాలు చేపట్టాలని పిలుపు.. అమెరికా- వెనిజులా మధ్య యుద్ధ మేఘాలు..
జైలు శిక్ష అనుభవిస్తున్న సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో శనివారం తన భర్తకు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలను తోసిపుచ్చారు. తన భర్త ఆర్థిక అక్రమాలకు, హింసను ప్రేరేపించాడనే అభియోగాలను ఆమె ఖండించారు. తన భర్త విదేశీ పర్యటనలు వృత్తిపరమైనవి, పర్యావరణ పరమైనవని ఆమె చెప్పింది. శాంతియుతంగా నిరసన తెలిపినప్పుడు, సీఆర్పీఎఫ్ టియర్ గ్యాస్ పేల్చినప్పుడు మాత్రమే యువత స్పందించిందని, పరిస్థితి తీవ్రమైనట్లు చెప్పింది.
శనివారం, లడఖ్ డిజిపి ఎస్డి సింగ్ జామ్వాల్ మాట్లాడుతూ, వాంగ్చుక్ పాకిస్తాన్‌తో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు, వాంగ్చుక్ నిరసనల వీడియోలను సరిహద్దు వెంబడి షేర్ చేసిన పాకిస్తాన్ నిఘా కార్యకర్తను ఇటీవల అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇటీవల పాక్ మీడియా డాన్ నిర్వహించిన ఒక కార్యక్రమం కోసం వాంగ్‌చుక్ పాకిస్తాన్ వెళ్లడం అనుమానాస్పదంగా ఉందని చెప్పారు.