PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ప్రజలు తమ హక్కుల కోసం నినదిస్తున్నారు. గత వారం రోజులుగా పీఓకేలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ నిరసనల్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీని ఉపయోగిస్తోంది. ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 15 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాల్లో భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేశారు. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులతో మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంపై దాడి భారత్‌కు అతిపెద్ద ముప్పు అని అన్నారు. భారత్‌లో అనేక మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయని, ప్రజాస్వామ్య విధానం అందరికి స్థానం కల్పిస్తుందని, కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థపై అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
Munawar Faruqui: స్టాండ్ ఆప్ కమెడియన్ మునావర్ ఫరూఖీని గ్యాంగ్ స్టర్లు రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్‌లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. హిందూ దేవుళ్లపై జోకులు వేయడం ద్వారా మునావర్ వారికి హిట్ లిస్టులోకి వచ్చాడు. హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్న మునావర్ ఫరూఖీ హత్యకు
Crime: 15 ఏళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంతో చోటు చేసుకుంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ మంగళవారం సిబ్బంది క్వార్టర్స్‌లో మృతి చెంది కనిపించింది. ఆమె మృతదేహం నగ్న స్థితిలో లభించింది. ఈ సంఘటన పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. అయితే, కొన్ని గంటల్లోనే పోలీసులు సాంకేతిక నిఘా ఉపయోగించి అమ్రేలికి చెందిన మోహాన్ పార్ఘిని నిందితుడిగా […]
Bareilly violence: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం నెలకొంది. సెప్టెంబర్ 26న బరేలీలో దీనిపై ఆకస్మికంగా గుమిగూడిన ప్రజలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లకు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఇత్తెహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్(IMC) చీఫ్ తౌకీర్ రజాను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి సన్నిహితులు, అనుచరులపై యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించింది.
Pok Protests: పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా బలగాలు అరాచకానికి పాల్పడుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జరుగుతున్న నిరసనల్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి ఆర్మీకి వ్యతిరేకంగా పీఓకేలోని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.
Modi-Trump meet: అమెరికా, భారత్ మధ్య సుంకాల యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల చివర్లో మలేషియా కౌలాలంపూర్‌లో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలిసే అవకాశం ఉంది.
PoK Protests: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జనం తిరగబడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. సంవత్సరాల తరబడి పాకిస్తాన్ దోపిడీ, పేదరికానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. అయితే, ప్రతీసారి పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఈ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేస్తోంది.
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5-6 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా భారత్‌పై సుంకాలు విధించిన తర్వాత, రష్యా-భారత్ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఈ నేపథ్యంతో పుతిన్ పర్యటనలో ఇరు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
UPI: గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని రిజ్వర్ బ్యాంగ్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం అన్నారు.