Apple: ‘హ్యాకింగ్’పై ఆపిల్‌కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple: ఇటీవల ప్రతిపక్ష నేతలకు ఆపిల్ ఐఫోన్లు హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉందని అలర్ట్ మేసేజ్ రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ప్రతిపక్ష నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్లకు నోటిఫికేషన్లు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ ప్యానెల్ ఆపిల్ ఇండియా అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
‘స్టేట్ స్పాన్సర్డ్’ దాడులకు గురికావచ్చని ఇటీవల విపక్ష నేతల ఐఫోన్లకు నోటిఫికేషన్లు వచ్చాయి. దీనిపై ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే ఐఫోన్ హ్యాకింగ్ పై ప్రతిపక్షాల ఆందోళనల్ని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిన్న తోసిపుచ్చారు. ఎన్నికల సీజన్ అంటూ దీన్ని కొట్టిపారేశారు.
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
Read Also: Minister Srinivas Goud: రాహూల్ గాంధీ పది సార్లు పర్యటించినా.. కాంగ్రెస్ అధికారంలోకి రాదు..!
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, నేతలు పవన్ ఖేరా, శశిథరూర్, కేసీ వేణుగోపాల్, సుప్రీయా శ్రీనాథ్, టీఎస్ సింఘ్‌దేవ్, భూపిందర్ సింగ్ లతో పాటు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ల మొబైల్ ఫోన్లకు నోటిఫికేషన్లు వచ్చాయి.
ఆపిల్ దాదాపు 150 దేశాల్లోని పలువురికి ఈ అలర్ట్ జారీ చేసింది. అయితే ప్రభుత్వంపై విపక్షాల దాడిని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తిప్పికొట్టారు. ప్రధాని నాయకత్వంలో దేశపురోగతిని తట్టుకోలేకే కొంత మంది ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నోటిఫికేషన్లపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని తెలిపారు.
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!