Mahua Moitra: మహువాను “లోక్‌సభ నుంచి తక్షణమే బహిష్కరించాలి”.. ఎథిక్స్ ప్యానెల్ డ్రాఫ్ట్ రిపోర్ట్ రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకుందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. ‘క్యాష్ ఫర్ క్వేరీ’గా పిలువబడుతున్న ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఇప్పటికే ఆమెను విచారించింది. ఈ నేపథ్యంలో ఎథిక్స్ ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదిక తయారైంది. ఇందులో ఆమెపై ‘కఠిన శిక్ష’ విధించాలని సూచించిందని, ఆమెను లోక్‌సభ నుంచి తక్షణమే బహిష్కరించాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఎథిక్స్ కమిటీ ముసాయిదాలో.. మోయిత్రా చర్యలు అనైతికమని, పార్లమెంటరీ ప్రత్యేక హక్కును ఉల్లంఘించాయని మరియు సభను ధిక్కరించినట్లు పేర్కొంది. ఇంతే కాకుండా గిఫ్టులు, లంచాల గురించి మోయిత్రా మరియు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీల ప్రకటనల మధ్య వైరుధ్యాలను కూడా నివేదిక హైలెట్ చేసింది. ఈ నివేదికను పార్లమెంట్ స్పీకర్‌కి పంపించనుంది.
Also Read
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
Read Also: Uttar Pradesh: రికార్డుల్లో నేను చనిపోయాను.. కానీ నాకు ఏకే 47 కావాలి.. ప్రధాని కార్యదర్శికి లేఖ
పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడంతో ఈ అంశం దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకున్నట్లు ఆరోపించారు. దుబాయ్ నుంచి పలుమార్లు లాగిన్ అయినట్లు తెలిసింది. ఈ మొత్తం వివాదంపై ఇప్పటికే ఎథిక్స్ కమిటీ హోం, విదేశీ వ్యవహారాలు, ఐటీ మంత్రిత్వ శాఖల నుంచి వివరాలు తెప్పించుకుంది. వీటి ఆధారంగా మహువామోయిత్రాను విచారించింది.
ఈ వ్యవహారంలో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెల్‌కి అఫిడవిట్ సమర్పించడం కొసమెరుపు. తన నుంచి గిఫ్టులు తీసుకుని ప్రధాని మోడీ, అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా ప్రశ్నలు అడినట్లు అందులో పేర్కొన్నారు. తనతో చేయకూడని పనులు చేయించుకున్నట్లు అఫిడవిట్‌లో ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎథిక్స్ ప్యానెల్ విచారణ సందర్భంగా విపక్ష ఎంపీలు మహువా మోయిత్రాకు అండగా నిలబడ్డారు. మరోవైపు మహువా మోయిత్రాపై లోక్‌పాల్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినట్లు ఎంపీ నిషికాంత్ దూబే నిన్న ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రకటించారు.
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్‌ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!