JNU: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపుపై వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు దాడి చేశాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) గురువారం ఆరోపించింది. అయితే, ఏబీవీపీ ‘‘రావణ దహన’’ కార్యక్రమాన్ని మత రాజకీయం కోసం వాడుకుంటోందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ గురువారం బాంబు పేలుడు కారణంగా 9 మంది మరణించినట్లు, నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పాక్ మీడియా నివేదించింది. ఈ సంఘటన వివరాలను పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మియాన్ సయీద్ కార్యాలయం ధృవీకరించిందని డాన్ మీడియా తెలిపింది. ఈ సంఘటన తర్వాత పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి.
Israel-Hamas War: అక్టోబర్ 07 నాటి దాడుల తర్వాత నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో హమాస్‌ను తుడిచిపెట్టేందుకు విస్తృత దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే హమాస్ అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయిల్ అంతం చేసింది. కానీ, మరికొంత మంది ఇజ్రాయిలీ బందీలు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. ఇటీవల, గాజాలో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు గాజా పీస్ ప్లాన్ ప్రకటించారు. అయితే, మరోవైపు గాజా సిటీని వదిలి వెళ్లాలని ఇజ్రాయిల్ బుధవారం తుది హెచ్చరికలు జారీ చేసింది.
Spying: హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా, హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) తరుపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అధికారులు అరెస్ట్ చేశారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్ లో వీడియోలు చేసిన పాల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన అక్రమ్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. Read Also: Gandhi: దేశ విభజన తర్వాత.. మహాత్మా గాంధీ […]
Eknath Shinde: 26/11 ముంబై ఉగ్ర దాడుల తర్వాత, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోకపోవడం ‘‘ద్రోహం’’ అని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే అన్నారు. ఎవరి ఒత్తిడితో కాంగ్రెస్ పాకిస్తాన్‌పై దాడికి సిద్ధ పడలేదని ప్రశ్నించారు. శివసేన వార్షిక దసరా ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే తన సొంత పార్టీ అనుచరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Putin: భారతదేశం పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గదని ఆయన అన్నారు. ‘‘భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ అనుమతించదు’’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ లాంటి చర్యల్ని అనుమతించరని చెప్పారు. పుతిన్ గురువారం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను విమర్శించారు. రష్యాతో ఇంధన కొనుగోలును నిలిపేయాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పుతిన్ నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి. దక్షిణ రష్యాలోని సోచిలో […]
Taliban: ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఆగస్టు 2021లో ఆఫ్ఘన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత, ఒక తాలిబాన్ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య జరిగే మొదటి ఉన్నతస్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం.
Earth: మన విశ్వంలో ఇప్పటి వరకు జీవజాలానికి అనువైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. భూమి లాంటి జీవనానికి అనుకూలంగా ఉన్న గ్రహాలను కనుగొనేందుకు ఈ అనంత కోటి విశ్వంలో శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. భూమికి ఉన్న ఫీచర్లు లాంటివి ఏ గ్రహానికి లేవు. తన మాతృ నక్షత్రం అయిన సూర్యుడి నుంచి మరీ దూరంగా కాకుండా, మరీ దగ్గరగా కాకుండా జంతు, వృక్షాలకు అనువైన ‘‘గోల్డెన్ లాక్ జోన్’’లో ఉంది. దీనికి తోడు చంద్రుడి లాంటి ఉపగ్రహం కూడా భూమికి ఉండటం ప్లస్ పాయింట్.
Sir Creek: భారత్-పాకిస్తాన్ మధ్య కొత్తగా ‘‘సర్ క్రీక్ ’’ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ తన సైనిక మౌలిక సదుపాయాలను పెంచడంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. ఈ సమస్యను భారత్ చర్చల ద్వారా చాలా సార్లు పరిష్కరించేందుకు ప్రయత్నించినా, పాకిస్తాన్ ఉద్దేశాలు మాత్రం వేరేగా ఉన్నాయని రాజ్ నాథ్ అన్నారు. అసలు ఏంటీ సర్ […]
BJP: భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కొలంబియాలోని ఒక యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ.. భారత్‌లో ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆయన అవమానకరమని అన్నారు. విదేశీ గడ్డపై భారతదేశాన్ని అప్రతిష్టపాటు చేయడానికి మరోసారి కాంగ్రెస్ ఎంపీ ప్రయత్నించారని కంగనా ఆరోపించారు. […]