BJP: విదేశాల్లో భారత్‌ను కించపరుస్తున్న రాహుల్ గాంధీ.. బీజేపీ నేతల ఆగ్రహం..
- రాహుల్ గాంధీ దేశానికి అవమానకరం..
- కొలంబియాలో రాహుల్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కొలంబియాలోని ఒక యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ.. భారత్‌లో ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆయన అవమానకరమని అన్నారు. విదేశీ గడ్డపై భారతదేశాన్ని అప్రతిష్టపాటు చేయడానికి మరోసారి కాంగ్రెస్ ఎంపీ ప్రయత్నించారని కంగనా ఆరోపించారు.
‘‘అతను ఒక అవమానకరమైన వ్యక్తి. దేశాన్ని విమర్శిస్తూ, ప్రతిచోటా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అందరికీ తెలుసు. ఇక్కడి ప్రజలు గొడవపడేవారని, వారు నిజాయితీపరులు కాదని అతను చెబుతుంటే, దీని ద్వారా అతను భారతీయులు బుద్ధిహీనులు అని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు,’’ అని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా, సాధారణ ప్రజల్ని కూడా అవమానించడమే అని ఆమె అన్నారు. దేశాన్ని అతను ఎప్పుడూ కించపరుస్తూనే ఉంటాడని, అతడి వ్యాఖ్యలకు దేశం సిగ్గుపడుతుందని ఆమె అన్నారు.
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
Read Also: Osmania Hospital : ఉస్మానియా కొత్త ఆస్పత్రి భవనం ఎన్ని అంతస్తులో తెలుసా.?
విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. ‘‘భారతదేశంలో జరుగుతున్న ఏకైక అతిపెద్ద ప్రమాదం ప్రజాస్వామ్యంపై దాడి. భారతదేశం వాస్తవానికి దాని ప్రజలందరి మధ్య సంభాషణ… విభిన్న సంప్రదాయాలు, మతాలు, ఆలోచనలకు స్థలం అవసరం. ఆ స్థలాన్ని సృష్టించడానికి ఉత్తమ మార్గం ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రస్తుతం, ప్రజాస్వామ్య వ్యవస్థపై సమూల దాడి జరుగుతోంది. కాబట్టి అది ఒక ప్రమాదం’’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ విదేశాలకు వెళ్లి, అక్కడి నుంచి అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు అని అన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను విదేశాల్లో కించపరచడం ఆయనకు అలవాటుగా మారిందని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
తాజావార్తలు
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!