Spying: పాకిస్తాన్ కోసం గూఢచర్యం.. యూట్యూబర్ వసీం అక్రమ్ అరెస్ట్..
- పాకిస్తాన్ ఐఎస్ఐ తరుపున గూఢచర్యం..
- హర్యానా యూట్యూబర్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spying: హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా, హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) తరుపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అధికారులు అరెస్ట్ చేశారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్ లో వీడియోలు చేసిన పాల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన అక్రమ్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Gandhi: దేశ విభజన తర్వాత.. మహాత్మా గాంధీ పాకిస్థాన్‌లో నివసించాలనుకున్నారా..? ఆశ్చర్యపరిచే నిజం..!
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
వసీం అక్రమ్ గత మూడేళ్లుగా పాకిస్తాన్ ఏజెంట్లతో టచ్‌లో ఉన్నాడని, వారికి సిమ్ కార్డులు కూడా అందించినట్లు తేలింది. అతడి వాట్సాప్ చాట్ నుంచి నేరపూరిత మెసేజులను పోలీసులు గుర్తించారు. చాట్ నుంచి తొలగించిన మెసేజ్‌లను తిరిగి పొందేందుకు అతడి మొబైల్‌ను ఫోరెన్సిక్‌కు తరలించారు. పాల్వాల్ పోలీసులు గత వారం మరో పాకిస్తాన్ గూఢచారి తౌఫిక్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇతనే అక్రమ్ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. 2021లో అక్రమ్ పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పాకిస్తాన్ ఏజెంట్ డానిష్‌తో పరిచయం ఏర్పడింది.
అక్రమ్, తౌఫిక్ ఇద్దరూ ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఐఎస్ఐ, పాకిస్తాన్ హైకమిషన్‌తో సంప్రదింపులు జరిపారు. ఇద్దరు నిందితులు కూడా భారత్‌కు సంబంధించిన సున్నిత వివరాలను పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు తేలింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎష్పీ వరణ్ సింగ్లా చెప్పారు. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!