Russia: ఇటీవల కాలంలో రష్యా, పాకిస్తాన్ యుద్ధ విమానాలకు ఇంజన్లు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతో కాంగ్రెస్, ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ప్రధాని మోడీ దౌత్య విధానం విఫలమైందని ఆరోపిస్తోంది. అయితే, వీటన్నింటిపై రష్యా క్లారిటీ ఇచ్చింది.
Pakistan: భారత ఆర్మీ, రాజకీయ నాయకులు ఇటీవల పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా కవ్వింపులకు పాల్పడితే పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపం మారిపోతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. అయితే, ఈ వార్నింగ్‌లపై పాకిస్తాన్ స్పందించింది. రెండు దేశాల మధ్య భవిష్యత్ వివాదాలు ‘‘ తీవ్రమైన నాశనానికి’’ దారి తీస్తాయని హెచ్చరించింది. ఈ బాధ్యతారహిత ప్రకటనలు కవ్వించే ప్రయత్నమని పాక్ ఆరోపించింది.
Coldrif Syrup: మధ్యప్రదేశ్‌లో చింద్వారాలో కోల్డ్రిఫ్ సిరప్ కారణంగా 11 మంది చిన్నారులు మరణించిన సంఘటన సంచలనంగా మారింది. చిన్నారులకు ఈ సిరప్‌ని రాసిన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు. చనిపోయిన చిన్నారుల్లో ఎక్కువ మంది పరాసియాలో శిశువైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్ సోని క్లీనిక్‌లో చికిత్స తీసుకున్నారు.
Manipur: జాతి వ్యతిరేఖ ఘర్షణలతో గత రెండేళ్లుగా మణిపూర్ అట్టుడుకుతోంది. పరిస్థితి చేజారడంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. అయితే, ఇప్పుడు మళ్లీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది. మాజీ సీఎం బిరేన్ సింగ్ సహా మణిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించడానికి కేంద్ర నాయకత్వాన్ని కలువనున్నారు. ఈ మేరుకు వారంతా ఢిల్లీ బయలుదేరారు. Read Also: Off The Record : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నిక కాంగ్రెస్ […]
Pakistan: అమెరికాకు చాలా సన్నిహితంగా మారుతున్న పాకిస్తాన్, కొత్త పథకానికి తెరతీసింది. అమెరికాతో కలిసి అరేబియా సముద్రంలో ఓడరేవును నిర్మించాలని భావిస్తోంది. పాకిస్తాన్ ఈ ప్రతిపాదనను యూఎస్ ముందు ఉంచింది. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పస్ని పట్టణంలో ఈ సివిల్ పోర్టు ఉంటుంది. ఇది ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు దగ్గరగా ఉంటుంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందానికి మరింత ఆలస్యమైతే, ఇంకా విధ్వంసం జరగొచ్చని అన్నారు. హమాస్ తక్షణమే స్పందించాలని, లేకపోతే అన్నీ మారిపోతాయని, ఆలస్యం అంగీకారమవ్వదని, గాజా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌పై భారత్ సైన్యం చేసిన దాడి గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికా తయారీ F-16, చైనీస్ J-17లను భారత్ కూల్చివేసిందని శుక్రవారం వెల్లడించారు. పాకిస్తాన్ కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పారు. పాకిస్తాన్ తన పౌరుల్ని తప్పుదారి పట్టించేందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, భారత్ జెట్లను నాశనం చేశామనే పాక్ వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. పాకిస్తాన్ స్వయంగా భారత్‌ను కాల్పుల విరమణ కోరిందని చెప్పారు.
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయ సినిమాల గురించి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. రష్యాలో ఇండియన్ సినిమాలకు చాలా ఆదరణ ఉందని చెప్పారు. ‘‘మేము భారతీయ సినిమాను ప్రేమిస్తున్నాము’’ అని సోచి నరగంలో జరిగిన వాల్డాయ్ చర్చ వేదికపై నుంచి పుతిన్ అన్నారు.
Taliban: ఆఫ్ఘనిస్తాన్ లో 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశానికి చెందిన మంత్రి భారత్‌లో పర్యటించేందుకు వస్తున్నారు. విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అక్టోబర్ 09న భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ పరిణామం ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతోంది. ఐక్యరాజ్యసమితి ప్రయాణ ఆంక్షల జాబితాలో ఉన్న ముత్తాకికి, భారత పర్యటన కోసం అనుమతి లభించింది. దీంతో అక్టోబర్ 09-16 మధ్య ఆయన దేశంలో పర్యటించనున్నారు. జనవరి నుంచే భారత […]