Earth: మన విశ్వంలో ఇప్పటి వరకు జీవజాలానికి అనువైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. భూమి లాంటి జీవనానికి అనుకూలంగా ఉన్న గ్రహాలను కనుగొనేందుకు ఈ అనంత కోటి విశ్వంలో శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. భూమికి ఉన్న ఫీచర్లు లాంటివి ఏ గ్రహానికి లేవు. తన మాతృ నక్షత్రం అయిన సూర్యుడి నుంచి మరీ దూరంగా కాకుండా, మరీ దగ్గరగా కాకుండా జంతు, వృక్షాలకు అనువైన ‘‘గోల్డెన్ లాక్ జోన్’’లో ఉంది. దీనికి తోడు చంద్రుడి లాంటి ఉపగ్రహం కూడా భూమికి ఉండటం ప్లస్ పాయింట్.
ఇక భూమి 23.5 డిగ్రీలు వంగి తన అక్షం చుట్టూ తాను తిరిగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనందరికి తెలుసు. భూమి ప్రతీ గంటలకు దాదాపుగా 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. ఇంత స్పీడ్‌లో తిరుగుతున్న భూమి ఒక్క సెకను పాటు ఆగితే ఏం అవుతుందో ఊహించుకోండి. ఒక్క సెకనే కదా ఏం అవుతుందని అనుకుంటే పొరపాటే. ఈ ఒక్క సెకన్ లో ప్రళయమే ముంచుకు వస్తుంది.
Read Also: Sir Creek: భారత్-పాకిస్తాన్ మధ్య ‘‘సర్ క్రీక్’’ వివాదం ఏంటి.? రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఎందుకు.?
ప్రతీ 23 గంటల 56 నిమిషాలకు భూమి తన చుట్టూ తాను ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. ఈ స్థిరమైన కదలికలు పగలు-రాత్రులకు సహాయపడుతున్నాయి. వాతావరణ, మహాసముద్రాల ప్రవర్తనల్ని ప్రభావితం చేస్తుంది. ఒక వేళ ఒక్క సెకన్ పాటు భూమి తిరగడం ఆపేస్తే, భూమిపై ఉన్న ప్రతీ ఒక్కటి వినాశకరమైన వేగంతో తూర్పు వైపు విసిరేయబడుతారు. వాతావరణ కదలికల్లో ఉండీ, వెయ్యి తుఫానుల శక్తితో భూమిపై ఉన్న ప్రకృతిని తుడిచిపెడుతుంది. నిర్మాణాలు కూలిపోతాయి, చెట్లు వేర్లతో సహా విసిరేయబడుతాయి.
ఆకస్మికంగా భూమి ఆగడం వల్ల, భూ అంతర్భాగంలోని పొరలు మారడం వల్ల, భారీ భూకంపాలు సంభవిస్తాయి. మహాసముద్రాలు ఉప్పొంగి, సునామీలు విధ్వంసం సృష్టిస్తాయి. ఈ పరిణామం భూమిపై ఉన్న ప్రతీ ఒక్కరిని చంపేస్తుంది, మనం ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా ఆగితే ఎలా మనం ముందుకు పడుతామో, 1600 వేగంతో ప్రయాణిస్తున్న భూమి ఆగితే ప్రతీ ఒక్కరు కూడా తీవ్రమైన వేగంతో తోసేయబడుతారని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీత్ డిగ్రాస్సే టైసన్ చెప్పారు.
ఇదే కాకుండా, ఈ పరిణామం చంద్రుడి లయను కూడా దెబ్బతీస్తుంది. భూమి భ్రమణం దాని గురుత్వాకర్షణ శక్తితో ముడిపడి ఉంది. ఇది చంద్రుడిని ప్రభావితం చేస్తుంది. ఇది చంద్రుడి మార్గాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. అయితే, భూమి భ్రమణం ఆగిపోకయే అవకాశం లేనప్పటికీ, అలాంటి సంఘటన పరిణామాలు మాత్రం విధ్వంసంగా ఉంటాయి.