Myanmar: చైనా సరిహద్దుని స్వాధీనం చేసుకున్న సాయుధ మయన్మార్ గ్రూప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Myanmar: భారత సరిహద్దు దేశం మయన్మార్‌లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుంచి ఆ దేశంలో హింస చెలరేగింది. జుంటా పాలకకు వ్యతిరేకంగా అక్కడ సాయుధ గ్రూపులు పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అక్కడి సైనిక పాలకులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లు సైనికులు కంట్రోల్‌లో ఉన్న చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను మూడు సాయుధ మైనారిటీ గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. ఉత్తర షాన్ రాష్ట్రంలోని ఉన్న ఈ చైనా సరిహద్దు చాలా కీలకం. ప్రస్తుతం ఆ రాష్ట్రం అంతటా ఘర్షణలు చెలరేగాయి.
సైన్యంపై తిరుగుబాటు చేస్తున్న సాయుధ గ్రూపులు సైనిక స్థావరాలు, చైనాతో వాణిజ్యానికి ముఖ్యమైన పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. నగదు కొరత ఉన్న జుంటా ప్రభుత్వానికి చైనా నుంచి సాయం డబ్బు అందకుండా వాణిజ్య మార్గాలను మూసేశాయి. మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ (MNDAA) కైన్ శాన్ క్యావ్ట్ సరిహద్దు గేటును స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా చెప్పింది. ఈ గ్రూపుతో అరకాన్ ఆర్మీ (AA) మరియు తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (TNLA)తో మిత్రుత్వ ఉంది. సరిహద్దు వద్ద ఎంఎన్డీఏఏ తన జెండాను ఏగరేసింది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
Read Also: China: చైనాలో ప్రబలుతున్న “మిస్టరీ వ్యాధి”.. కారణాలు ఇవే అంటున్న ఆ దేశ అధికారులు..
ప్రస్తుతం ఆక్రమించుకున్న సరిహద్దు మయన్మార్-చైనా వాణిజ్యానికి అత్యంత కీలకంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో సరిహద్దు క్రాసింగ్ వద్ద ఆపి ఉన్న 120 ట్రక్కుల్లో మంటలు చెలరేగాయి, దీనికి సాయుధ సమూహాలే కారణమని జుంటా ప్రభుత్వ ప్రతినిధి జా మిన్ తున్ ఆరోపించారు. సైన్యం అధికారం చేపట్టినప్పటి నుంచి అక్కడ సాయుధ తిరుగుబాటు ప్రారంభమైంది. ఇది ఆ దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది.
ఇదిలా ఉంటే చైనా, మయన్మార్ సైన్యానికి మద్దతు ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చైనా-మయన్మార్ సంయుక్తంగా సరిహద్దు వద్ద సైనిక విన్యాసాలు మొదలుపెట్టాయి. యువాన్ ప్రావిన్స్‌లో నవంబర్ 28 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయని చైనా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు మయన్మార్ అల్లర్ల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. భారత పౌరులు ఆ దేశానికి ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అక్కడి నివసిస్తున్న వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపింది. అయితే తిరుగుబాటుని అణిచివేయడానికి మయన్మార్ ఆర్మీ ప్రజల్ని చంపుతోంది. అక్కడి నుంచి మనదేశంలోని మిజోరాం రాష్ట్రానికి ప్రజలు వలస వస్తున్నారు.
- Tags
- china
- india
- junta Ruling
- Myanmar
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!