Rozgar Mela: ప్రధాని చేతుల మీదుగా 51,000 మందికి జాబ్ లెటర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rozgar Mela: ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరబోతున్న 51,000 మందికి ‘రోజ్‌గార్ యోజన’ కింద జాబ్ లెటర్స్ ఇవ్వబోతున్నారు. నవంబర్ 30న ప్రధాని చేతుల మీదుగా వారిందకిరి ఉద్యోగ నియామక పత్రాలను అందుకోనున్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న ఉద్యోగులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారని మంగళవారం పీఎం కార్యాలయం తెలిపింది. ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా దేశవ్యాప్తంగా 37 ప్రదేశాలలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నియామకాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
Read Also:Honour killing: పాకిస్తాన్‌లో పరువు హత్య.. అబ్బాయితో డ్యాన్ చేసిందని అమ్మాయిని హతం చేసిన కుటుంబం..
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
రెవెన్యూ, హోం వ్యవహరాలు, ఉన్నత విద్య, పాఠశాల విద్య, ఆర్థిక సేవలు, రక్షణ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం, కార్మిక-ఉపాధి శాఖల్లో వీరి నియామకం జరగనుంది. ‘‘రోజ్‌గార్ మేళా ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాన మంత్రి నిబద్ధత దిశగా ఒక అడుగు. ఇది మరింత ఉపాధి కల్పలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. యువతకు సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్థవంతమైన అవకాశాలను అందిస్తుంది’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
కొత్త నియామకాలు వారి వినూత్న ఆలోచనలు, సామర్థ్యాలు దేశ పారిశ్రామిక, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని బలోపేతం చేసే పనిలో దోహదపడతాయని, అభివృద్ధి చెందిన భారతదేశంగా మోడీ ఆశయాన్ని సాకారం చేయడంలో సహాయపడతాయని పేర్కొంది. కొత్తగా నియమితులైనవారు ఐగోట్ కర్మయోగి పోర్టల్‌లోని ఆన్‌లైన్ మాడ్యూల్ అయిన ‘కర్మయోగి ప్రారంభ్’ ద్వారా శిక్షణ పొందే అవకాశాన్ని కూడా పొందుతారు. 800 కంటే ఎక్కువ ఈ లర్నింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!