South Africa: దక్షిణాఫ్రికా ప్లాటినం గనిలో భారీ ప్రమాదం జరిగింది. గనిలోకి కార్మికులను తీసుకెళ్తున్న ఎలివేటర్ ఒక్కసారి కూలిపోయింది. దీంతో కార్మికులు ఒక్కసారిగా 200 మీటర్లు కిందకి పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. 75 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు మంగళవారం తెలిపారు. దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న రస్టెన్‌బర్గ్ నగరంలోని గనిలో కార్మికులు విధులు ముగించుకుని బయటకు వస్తున్న క్రమంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
Read Also: New Rules: డిసెంబర్ 1 అమల్లోకి రానున్న కొత్త రూల్స్..అవేంటంటే?
గాయపడిన 75 మంది కార్మికులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంపాల ప్లాటిన్ హోల్డింగ్స్(ఇంప్లాట్స్)సీఈఓ నికోముల్లర్ ప్రకటన చేశారు. ఇది ఇంప్లాట్స్ చరిత్రలో చీకటి రోజని, ఎలివేటర్ పడిపోవడానికి కారణాలపై దర్యాప్తు చేయాల్సి ఉందని, మంగళవారం నుంచి గని కార్యకలాలపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.
గాయపడిన వారిలో కొంతమందిలో తీవ్రమైన ఫ్రాక్చర్లు ఉన్నాయని ఇంప్లాంట్స్ ప్రతినిధి జోహాన్ థెరాన్ తెలిపారు. ఎలివేటర్ షాఫ్ట్ నుంచి సుమారు 200 మీటర్ల దిగువకు పడిపోయిందని, ఇది అసాధారణమైన ప్రమాదమని అతను చెప్పారు. దక్షిణాఫ్రికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాటిన్ ఉత్పత్తిదారు. 2022లో దేశంలో జరిగిన అన్ని మైనింగ్ ప్రమాదాల కారణంగా 49 మంది మరణించారు. అంతకుముందు ఏడాది 74 జరిగాయి. దక్షిణాఫ్రికా గణాంకాల ప్రకారం దక్షిణాఫ్రికా ప్రమాదాల వల్ల 2000లో దాదాపుగా 300 మంది మరణించారు. గత రెండు దశాబ్ధాలుగా ప్రమాదాలు క్రమంగా తగ్గాయి.