Pannun case: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కేసులో భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా(52)ను తమకు అప్పగించాలని అమెరికా కోరుతున్నట్లు చెక్ రిపబ్లిక్ అధికారులు తెలిపారు. నిఖిల్ గుప్తా కస్టడీని చెక్ అధికారులు ధ్రువీకరించారు. పన్నూ హత్య కుట్రలో ఇతని పాత్ర ఉందని అమెరికా ఆరోపిస్తోంది. భారత ప్రభుత్వ ఉద్యోగి ఆధ్వర్యంలో నిఖిల్ గుప్తా అమెరికా గడ్డపై, అమెరికన్ పౌరుడు పన్నూను చంపేందుకు కుట్ర పన్నినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గుప్తాను ఈ ఏడాది జూన్ నెలలో చెక్ అధికారులు అరెస్ట్ చేశారు.
Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నట్లు పోలీసుల వర్గాలు అనుమానిస్తున్నాయి. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దర పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు సాగర్ శర్మ, మనో రంజన్ పార్లమెంట్ హాలులో పోగ డబ్బాలను వదిలారు. దీంతో సభలోని ఎంపీలంతా భయభ్రాంతులకు గురయ్యారు.
Khalistani Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల కాలంలో భారత్‌ని బెదిరిస్తూ పలు వీడియోల్లో కనిపిస్తున్నాడు. ఇటీవల భారత పార్లమెంట్ పునాదులు కదిలిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ ఆ వీడియోలో హెచ్చరించాడు. డిసెంబర్ 13, 2001లో పార్లమెంట్‌పై లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి అయిన అప్జల్ గురు ఫోటోను వెనకాల పెట్టుకుని, గురుపత్వంత్ సింగ్ భారత్‌ని…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని, రాజ్యాంగానికి లోబడే నిర్ణయం ఉందని తెలిపింది. ఆర్టికల్ 370 కేవలం తాత్కిలిక సదుపాయం మాత్రమే అని, ఇది దేశంలో అవిభాజ్య అంతర్భాగమని చెప్పింది. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సూచించింది.
Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. బుధవారం రాయ్‌పూర్‌లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సాయ్ ప్రమాణస్వీకారం జరిగింది. ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
Baby Growing In Bowel: ఫ్రాన్స్ దేశంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. మహిళ పరిస్థితి తెలుసుకున్న డాక్టర్లతో పాటు నిజం తెలిసి సదరు మహిళ కూడా ఒక్కసారిగా కంగుతింది. 37 ఏళ్ల మహిళ తనకు తెలియకుండానే 23 వారాల గర్భవతి అని తేలింది. అయితే బిడ్డ పేగులో పెరుగుతున్నాడనే వార్త తెలిసి అంతా షాక్‌కి గురయ్యారు.
Lok Sabha security breach: పార్లమెంట్‌లోకి దుండగులు చొరబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. డిసెంబర్ 13, 2001 పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగి 22 ఏళ్లు పూర్తియిన ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. విజిటర్ గ్యాలరీ నుంచి హౌస్ ఛాంబర్లోకి దుండగులు ఎల్లో పొగతో కూడిన డబ్బాలతో ప్రవేశించారు. పలువురు ఎంపీలు ధైర్యంగా వీరిని పట్టుకున్నారు.
Congress: పార్లమెంట్లో భద్రత ఉల్లంఘనపై విపక్షాలు, కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ఛాంబర్లోకి ప్రవేశించి, ఎల్లో రంగులో పొగను వెదజల్లారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు పార్లమెంట్లో దాడి ఘటనపై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది.
అయితే ఈ తీర్పుపై దాయాది దేశం పాకిస్తాన్ తన అక్కసు వెల్లగక్కుతోంది. ఇప్పటికే తీర్పుకు విలువలేదని పాకిస్తాన్ అభివర్ణించగా.. దాని మిత్రదేశం చైనా, కాశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరింది. ఇదిలా ఉంటే పాక్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా భారత సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టారు.
Parliament Terror Attack: పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడిలో జరిగిన నేటికి 22వ వార్సికోత్సవం. ఈ ఘటన జరిగిన ఇదే రోజు మరోసారి భారత పార్లమెంట్‌పై మరోసారి దాడి జరిగింది. బుధవారం ఇద్దరు అగంతకులు పార్లమెంట్ లోపలకి ప్రవేశించి, ఎల్లో స్మోక్ బాంబులను విసిరారు. ఈ ఘటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. 2001లో పార్లమెంట్‌పై పాకిస్తాన్ ఆధారిత ఉగ్రసంస్థలు లష్కరేతోయిబా, జైషే మహ్మద్ దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 9 మంది భద్రతా సిబ్బంది చనిపోగా.. ఐదుగురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.