Parliament Terror Attack: పార్లమెంట్ టెర్రర్ అటాక్ 22వ వార్షికోత్సవం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరించిన రోజే భద్రతా ఉల్లంఘన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Terror Attack: పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడిలో జరిగిన నేటికి 22వ వార్సికోత్సవం. ఈ ఘటన జరిగిన ఇదే రోజు మరోసారి భారత పార్లమెంట్‌పై మరోసారి దాడి జరిగింది. బుధవారం ఇద్దరు అగంతకులు పార్లమెంట్ లోపలకి ప్రవేశించి, ఎల్లో స్మోక్ బాంబులను విసిరారు. ఈ ఘటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. 2001లో పార్లమెంట్‌పై పాకిస్తాన్ ఆధారిత ఉగ్రసంస్థలు లష్కరేతోయిబా, జైషే మహ్మద్ దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 9 మంది భద్రతా సిబ్బంది చనిపోగా.. ఐదుగురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.
ఈ ఉగ్రదాడి జరిగి 22 ఏళ్ల గడిచిన ఈ రోజే ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత పార్లమెంట్ ప్రారంభమైంది. ఈ సమయంలోనే విజిటర్‌గా వచ్చిన ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి దూకి నినాదాలు చేస్తూ, స్మోక్ బాంబుల్ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also: Siddharth: శివ కార్తికేయన్ కోసం ఏలియన్ గా మారిన సిద్ధార్థ్…
ఇదిలా ఉంటే ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ పార్లమెంట్‌పై దాడికి పాల్పడుతామంటూ ఓ వీడియోలో హెచ్చరించారు. అతను హెచ్చరించిన ఇదే రోజు పార్లమెంట్లో భద్రత వైఫల్యం తలెత్తింది. పార్లమెంట్ పునాదిని కదిలిస్తా అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు, పార్లమెంట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమైనప్పటికీ ఈ దాడి జరగడం గమనార్హం.
ఏం జరిగింది:
ఈ రోజు మధ్యాహ్నం 1.02 గంటలకు ఒక వ్యక్తి విజిటర్ గ్యాలరీ నుంచి దూకి ఛాంబర్ లోకి పరిగెత్తడంతో లోక్‌సభలో గందరగోళం తలెత్తింది. ఇద్దరు వ్యక్తులు ఎల్లో కలర్ పొగను వెదజల్లారు. ఒక వ్యక్తిని పట్టుకునేందుకు ఎంపీలు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు దుండగుడు డెస్కులపై నుంచి దూకాడు. ప్రతిపక్ష ఎంపీలు భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిందించారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంట్ వెలుపల మరో ఇద్దరు ఇలాగే పొగలు వెదజల్లుతూ నిరసన తెలిపారు. దుండగులను అమోల్ షిండే(25), నీలం(42)గా గుర్తించారు.
#WATCH | Delhi: Two protestors, a man and a woman have been detained by Police in front of Transport Bhawan who were protesting with colour smoke. The incident took place outside the Parliament: Delhi Police pic.twitter.com/EZAdULMliz
— ANI (@ANI) December 13, 2023
తాజావార్తలు
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!