China: డ్రాగన్ కంట్రీ చైనా తన బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. ప్రతీ విషయంలో భారత్‌ని చికాకు పెట్టేందుకే ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇటీవల సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దును సమర్థించింది. ఈ విషయంపై కూడా చైనా తన అల్ వెదర్ ఫ్రెండ్ పాకిస్తాన్‌కి మద్దతుగా నిలిచి, తన అక్కసును వెళ్లగక్కింది. ఇదిలా ఉంటే చైనా, భారత అవిభాజ్య అంతర్భాగమైన లడఖ్ ప్రాంతంపై అవాకులు చెవాకులు పేలింది.
Norovirus: యూకేలో ఇటీవల కాలంలో నోరోవైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. బీబీసీ ప్రకారం ఈ నెల ప్రారంభం వరకు దాదాపుగా 1500 మందికి ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడింది. గతేడాదడి ఇదే సమయంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం అధిక కేసులు నమోదవుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
Parliament Security Breach: బుధవారం రోజున జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13 రోజునే, నలుగురు నిందితులు పార్లమెంట్ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు నిందితులు విజిటర్ పాసులతో పార్లమెంట్‌లోకి వెళ్లారు. సభ జరుగుతున్న సమయంలో విజిటర్ గ్యాలరీ నుంచి దూసి ఛాంబర్ వైపు దూసుకెళ్తూ, పొగ డబ్బాలను పేల్చారు. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా చర్యలకు పాల్పడ్డారు. నలుగురు నిందితులతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా..…
తమిళనాడులో హిందీ భాష మరోసారి వివాదంగా మారింది. గోవా విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది, హిందీ రాకపోవడంతో ఓ తమిళ యువతిపై అనుచితంగా ప్రవర్తించడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. హిందీ భారతదేశ జాతీయభాష కాదని, ప్రజలు బలవంతంగా దీనిని నమ్మేలా చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
Medical Miracle: వైద్యశాస్త్రంలోనే ఈ ఘటన అద్భుతమని చెప్పాలి. వైద్యపరంగా మరణించిన ఓ మహిళ, 24 నిమిషాల తర్వాత బతికింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మరణానికి దగ్గర వెళ్లి వచ్చిన సదరు మహిళ తన అనుభవాలను పంచుకుంది. రచయిత్రి లారెన్ కెనడే గుండో కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత వైద్యపరంగా చనిపోయినట్లు ప్రకటించారు. దాదాపుగా అరగంట తర్వాత మళ్లీ ఆమెకు పునరుజ్జీవనం లభించింది.
Vivek Ramaswamy: వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరుపున ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తు్న్నారు. గురువారం సీఎన్ఎన్ టౌన్ హాల్లో వివేక్ రామస్వామిని ఒక ఓటర్ హిందూ విశ్వాసాల గురించి ప్రశ్నించింది. దీనికి రామస్వామి చెప్పిన జవాబు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Parliament: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అత్యంత పకడ్భందీ సెక్యూరిటీ వ్యవస్థ ఉంటే పార్లమెంట్‌లోకి విజిటర్ పాసులపై వెళ్లిన ఇద్దరు నిందితులు హంగామా సృష్టించారు. పొగ డబ్బాలను పేల్చి హల్చల్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల కూడా ఇలాంటి చర్యలకే పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో నలుగురితో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు లలిత్ ఝా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. లలిత్‌ని ప్రస్తుతం పోలీసులు ట్రాక్…
Food Poisoning: పెళ్లి భోజనాలు తిన్న వారికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఈ ఘటన మహారాష్ట్రాలోని నాగ్‌పూర్‌లో జరిగింది. నగర శివార్లలోని ఓ రిసార్టులో జరిగిన పెళ్లి కార్యక్రమంలో వడ్డించిన ఆహారం తిన్న 80 మంది వ్యక్తులకు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారని, వీరింతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఈ రోజు పోలీసులు తెలిపారు.
Man-Eating Tiger: మనిషి మాంసానికి మరిగిన పులి కోసం కేరళ ప్రభుత్వం వేట సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం వయనాడ్‌లో ఒక వ్యక్తిని చంపిన పులి కోసం కేరళ అటవీ అధికారులు వెతుకుతున్నారు. మ్యాన్ ఈటన్ పులిని 13 ఏళ్ల మగపులిగా గుర్తించినట్లు కేరళ అటవీ శాఖ మంత్రి ఎకే శశీంద్రన్ తెలిపారు. మ్యాన్ ఈటర్‌గా మారిన పులిని కాల్చి చంపేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.