నిందితులు నాలుగేళ్ల నుంచి టచ్‌లో ఉన్నట్లు, ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియా ద్వారా సమన్వయం చేసుకుని కుట్రకు పాల్పడినట్లు తేలింది. ఈ భద్రతా ఉల్లంఘనకు పాల్పడే ముందు పార్లమెంట్‌పై రెక్కీ నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Krishna Janmabhoomi: ఉత్తర్‌ప్రదేశ్ మథుర శ్రీకృష్ణ జన్మభూమి భూవివాదానికి సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 17 వ శతాబ్ధానికి చెందిన షాహీ ఈద్గా సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతించింది. సర్వే చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో అడ్వకేట్ కమిషనర్ని నియమించేందుకు కోర్టు పచ్చజెండా ఊపింది.
Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇద్దరు నిందితులు పార్లమెంట్‌లోకి విజిటర్లుగా ప్రవేశించి, హౌజులో పొగ డబ్బాలను పేల్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా లోక్‌సభలో గందరగోళం ఏర్పడింది. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Volkswagen: వచ్చే ఏడాది నుంచి అన్ని కార్ మేకర్ కంపెనీలు తమ కార్ల ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించాయి. టాటా, మారుతి సుజుకీ, హ్యుందాయ్ ఇలా ప్రముఖ కంపెనీలన్నీ కూడా తమ కార్ల ధరల్ని పెంచాలని నిర్ణయించాయి. జనవరి నుంచి కార్లు మరింత ప్రియం కానున్నాయి. ఇన్పుట్, మెటీరియల్ ఖర్చులు పెరుగుతుండటంతో ధరల్ని పెంచుతున్నట్లు వాహన తయారీ కంపెనీలు చెబుతున్నాయి.
Live-in partner: ఇటీవల కాలంలో లివ్ ఇన్ రిలేషన్స్ పెరుగుతున్నాయి. యువతీయువకులు సహజీవనం పేరుతో కలిసి ఉంటున్నారు. గతంలో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతి హత్య సహజీవనం ఎంత ప్రమాదకరమో నిరూపించింది. ఈ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న యువతులు పలు కారణాలతో హత్యలకు గురయ్యారు.
Holding Sneeze: తుమ్ములు వస్తే ఆగవు, అయితే కొన్ని సందర్భాల్లో ముక్కు నలవడం లేదా ఆపుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఓ కేసులో మాత్రం తుమ్ముని ఆపుకోవడం ఏకంగా ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టింది. తుమ్మును అదిమిపెట్టడంతో ఒక్కసారిగా అతని శ్వాసనాళంపై ఒత్తడి పెరిగి పగిలిపోయింది. అత్యంత అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
Karnataka High Court: అత్యాచార బాధితురాలు గర్భంతో ఉంటే, 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఉందని, ఈ విషయాన్ని బాధితులకు ఆయా పరిధిలోని పోలీసులు చెప్పాలని కర్ణాటక హైకోర్టు దిశానిర్దేశం చేసింది. దీని వల్ల బాధితులు సమయం దాటాక కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని హైకోర్టు చెప్పింది. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు, నేర ఫలితంగా గర్భం దాల్చింది. ఈ గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేయాలని కోరుతూ ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పోక్సో, అత్యాచార సెక్షన్లు నమోదయ్యాయి. ఈ…
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల మేకర్, ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా వ్యాప్తంగా 20 లక్షల కార్లను రీకాల్ చేయనుంది. టెస్లా కార్లలోని ఆటోపైలట్ అధునాతన సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలో కొత్త సేఫ్గార్డ్ని ఇన్స్టాల్ చేసేందుకు, ఈ సిస్టమ్‌ని మిస్ యూస్ చేయకుండా రక్షణ తీసుకునేందుకు టెస్లా కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ 2.03 మిలియన్ మోడల్ S, X, 3 మరియు Y వాహనాలకు అప్డేట్ను విడుదల చేస్తుందని ఏజెన్సీ తెలిపింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు మోహన్ యాదవ్ పదవీ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు సీఎం సంచలన ఆదేశాలు జారీ చేశారు. మతపరమైన, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Lok Sabha Security Breach: పార్లమెంట్లో ఈరోజు జరిగిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌లోకి విజిటర్ల రూపంలో వెళ్లి, సభ జరుగుతున్న సమయంలో ఛాంబర్లోకి దూసుకెళ్లారు. పొగతో కూడిన డబ్బాలు పేల్చారు. ఈ ఘటనతో ప్రజాప్రతినిధులు ఆందోళన చెందారు. సరిగ్గా డిసెంబర్ 13, 2001న పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడికి నేటితో 22 ఏళ్లు గడిచాయి. ఇదే రోజున ఇలా ఆగంతకులు దాడికి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు…