Pannun case: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తాను అప్పగించాలని యూఎస్ కోరుతుందన్న చెక్ రిపబ్లిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun case: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కేసులో భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా(52)ను తమకు అప్పగించాలని అమెరికా కోరుతున్నట్లు చెక్ రిపబ్లిక్ అధికారులు తెలిపారు. నిఖిల్ గుప్తా కస్టడీని చెక్ అధికారులు ధ్రువీకరించారు. పన్నూ హత్య కుట్రలో ఇతని పాత్ర ఉందని అమెరికా ఆరోపిస్తోంది. భారత ప్రభుత్వ ఉద్యోగి ఆధ్వర్యంలో నిఖిల్ గుప్తా అమెరికా గడ్డపై, అమెరికన్ పౌరుడు పన్నూను చంపేందుకు కుట్ర పన్నినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గుప్తాను ఈ ఏడాది జూన్ నెలలో చెక్ అధికారులు అరెస్ట్ చేశారు.
Read Also: AP Lokayukta: 60 ఏళ్ల వివాదానికి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పరిష్కారం
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
చెక్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రతినిధి వ్లాదిమిర్ రెప్కా ప్రకారం, గుప్తాను అమెరికా అభ్యర్థన మేరకు అరెస్ట్ చేశామని, ఆ తర్వాత అతడిని అప్పగించాలని అభ్యర్థన వచ్చిందని, కిరాయి హత్యకు కుట్ర పన్నినట్లు అతడిపై అభియోగాలు ఉన్నాయని చెప్పారు. అతడిని యూఎస్‌కి అప్పగించేందుకు చెక్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
భారత్ చేత ఉగ్రవాదిగా గుర్తించబడిన గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చేందుకు కుట్ర జరిగిందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ విషయంలో యూఎస్, తన ఆందోళనల్ని భారత్ వద్ద వ్యక్తం చేసింది. మరోవైపు ఎఫ్‌బీఐ, సీఐఏ చీఫ్‌లు భారత్‌కి వచ్చారు. ఈ కేసులో పన్నూను హత్య చేసేందుకు ఓ హంతకుడికి నిఖిల్ గుప్తా 1,00,000 డాలర్లు చెల్లించాడని, ఇందుకు జూన్ 9, 2023న 15,000 డాలర్లు అడ్వాన్సుగా ఇచ్చారని యూఎస్ న్యాయ శాఖ పత్రాలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!