Jammu Kashmir: కాశ్మీర్ సమస్యపై డ్రాగన్ కంట్రీ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని, ఆర్టికల్ 370ని రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఐదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థించింది. అయితే ఈ తీర్పు తర్వాతి రోజే చైనా కామెంట్స్ చేసింది.
రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ రోజు జరిగిన శాసనసభపక్ష నేత ఎన్నుకునే సమావేశంలో సీఎం అభ్యర్థిగా భజన్ లాల్ శర్మని ఎన్నుకున్నారు.
Tata Nexon: కార్ సేఫ్టీ, బిల్ట్ క్వాలిటీకి మారుపేరు ఏంటని ప్రశ్నించే, అందరి నుంచి ముందుగా వచ్చే సమాధానం టాటా. అయితే అలాంటి టాటాపై బెంగళూర్ వాసి ఆరోపణలు చేశారు. ఇటీవల తనకు లోపాలతో ఉన్న టాటా నెక్సాన్ కారు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కారు కొంటున్నాననే ఉత్సాహాన్ని బెంగళూర్ యెలహంకలోని ప్రేరణ మోటార్స్, టాటా చెదిరిపోయేలా చేసిందని సోషల్ మీడియాలో తన ఆవేదన వెల్లగక్కారు.
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ వివాదంపై భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఉద్దేశిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హోమంత్రికి చరిత్రను తిరగరాసే అలవాటు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘పండిట్ నెహ్రూ దేశం కోసం తన జీవితాన్ని అర్పించారు,
Rajasthan CM: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థుల ఎన్నికలో బీజేపీ అందరిని ఆశ్యర్యానికి చేసింది. ఇప్పటికే ఛత్తీస్గడ్కి విష్ణదేవ్ సాయ్, ఎంపీకి మోహన్ యాదవ్‌లను సీఎంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రానికి సీఎంగా కొత్తవారిని ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని సమాచారం. ఇక్కడ కూడా బీజేపీ బిగ్ సర్ప్రైజ్ ఇస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శాసనపక్ష నేతను బీజేపీ ఎమ్మె్ల్యేలు ఎన్నుకోబోతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజేని సీఎంగా చేస్తారా..? లేదా..?…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్లో భారీ ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ బేస్ వద్ద మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 23 మంది మరణించారని తెలుస్తోంది. ఈ దాడిని పాకిస్తాన్ తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు జరిపినట్లుగా అధికారులు తెలుపుతున్నారు.
Road Accident: ఎన్నో కలలతో వివాహంతో ఓకమైన కొత్త జంటను రోడ్డు ప్రమాదం కబళించింది. వధూవరులతో సహా ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకుంది. జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ట్రక్కు, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లైన జంట అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
Sanjay Raut: అలా అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మరిన్ని కష్టాలు..ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలో విజయంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నట్లైంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓడిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Delhi: తనను పెళ్లి చేసుకునేందుకు నో చెప్పిందనే కోపంతో ఓ వ్యక్తి మహిళ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆమె ఫోటోలతో నకిలీ సోషల్ మీడియా ఖతాలను క్రియేట్ చేసి, అవమానకరమైన పోస్టులు పెడుతూ, కించపరిచేలా కామెంట్స్ చేస్తూ వేధించాడు. చివరకు ఈ వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22 శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన అట్టహాసంగా జరగబోతోంది. శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించే గర్భగుడిని నిన్న ఆలయ ట్రస్ట్ ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది. ఇదిలా ఉంటే రామమందిరంలో పూజారులుగా పనిచేయడానికి ఎంపికైన 50 మందిలో ఘజియాబాద్‌కి చెందిన యువకుడు ఉన్నారు. దూధేశ్వర్ వేద విద్యాపీఠంలో ఏడేళ్ల చదివిన తర్వాత మోహిత్ పాండే తిరుపతి వెళ్లి వేద విద్యను అభ్యసించారు. ఇతరుల అర్చకులతో పాటు నియామకానికి ముందు ఆరు…