Ayesha Omar: పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని అందరికీ తెలుసు. అక్కడ మహిళకు కూడా భద్రత లేదు. ఒంటరిగా మహిళలు కనపిస్తే కిడ్నాప్‌కి గురవ్వడం, అత్యాచారానికి గురవ్వడం అక్కడ సర్వసాధారణంగా మారింది. అయితే, తాజాగా ఆ దేశ ప్రముఖ నటి అయేషా ఒమర్ కూడా పాకిస్తాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్నాన్ ఫైసల్ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడారు.
Parliament security breach: పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించి, దాడికి యత్నించిన కేసులో మాస్టర్ మైండ్‌గా చెప్పబడుతున్న లలిత్ ఝాకి ఢిల్లీ పాటియాల హౌజ్ కోర్టు 7 ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఢిల్లీ పోలీసులు పోలీసులు 15 రోజలు కస్టడీ కోరగా.. కోర్టు 7 రోజులకు పరిమితం చేసింది. ఈ దాడి ఘటనలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే పరారీలో ఉన్న లలిత్ ఝా గురువారం పోలీసులకు లొంగిపోయాడు.
Parliament Attack: బుధవారం పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన సంఘటన యావత్ దేశాన్ని కలవరపరిచింది. అత్యంత భద్రత ఉన్న సెక్యూరిటీని దాటుకుని ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ఛాంబర్లోకి వెళ్లి స్మోక్ కానస్టర్లను పేల్చడం ఆందోళన రేకెత్తించింది. 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి జరిగి డిసెంబర్ 13 తేదీ రోజునే నిందితులు ఈ ఘటనకు ఒడిగట్టారు. అయితే ఈ కేసులో పార్లమెంట్ లోపల ఘటనకు పాల్పడిన సాగర్ శర్మ, మనోరంజన్ తో పాటు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా చర్యలకు పాల్పడిన నీలందేవి, అమోల్ షిండేలను పోలీసులు…
Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ బ్యాన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. అయితే దీనిపై చర్చల విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి అక్కడి ప్రభుత్వ వర్గాలు. సోషల్ మీడియా వల్ల పిల్లలపై ఎంత వరకు హాని కలుగుతుందనే విషయంపై మంత్రులు జనవరి నుంచి సంప్రదింపులు ప్రారంభించాలని యోచిస్తున్నారు.
Hamas War: హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తమ లక్ష్యాలు నెరవేరే దాకా యుద్ధాన్ని ఆపేది లేదని, ఎంత ఒత్తిడి ఎదురైనా కూడా యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల చెప్పారు. దానికి అనుగుణంగానే ఇజ్రాయిల, గాజస్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. దీంతో పాటు వెస్ట్ బ్యాంకులో కూడా దాడులు నిర్వహిస్తోంది.
Iran: భారతీయ సందర్శకులకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి వచ్చే భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే సందర్శకుల వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ మంత్రివర్గం నిర్ణయించిందని ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి తెలిపారు. భారత్‌తో సహా 33 దేశాలకు వీసా నిబంధనలను రద్దు చేస్తూ ఇరాన్ బుధవారం నిర్ణయం తీసుకుంది.
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలతో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిఖిల్ గుప్తా కుటుంబం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది.
Krishna Janmabhoomi: మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసులో నిన్న అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలంలో షాహీ ఈద్గా సర్వేకు హైకోర్టు అంగీకరించింది. అయితే ఈ తీర్పుపై ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆర్డర్‌పై స్టే ఇవ్వలేమని చెప్పింది. మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌పై శాస్త్రీయ సర్వే నిర్వహించడానికి అలహాబాద్ హైకోర్టు నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ ని నిమయించేందుకు అంగీకరించింది. దీని కోసం విధివిధానాలను…
Swiggy: బిర్యానీ అంటే ఒక్క హైదరాబాద్ లోనే కాదు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉందని స్విగ్గీ తన వార్షిక అమ్మకాల నివేదికలో తెలిపింది. 2023లో దేశవ్యాప్తంగా ప్రతీ సెకనుకు 2.5 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ప్రతీ 5.5 చికెన్ బిర్యానీలకు ఒక వెజ్ బిర్యానీ ఉందని తెలిపింది.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా రోజుల తర్వాత మీడియాలో, ప్రజలనుద్దేశించి గురువారం మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పుతిన్ 2030 వరకు అధ్యక్షుడిగా ఉండేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నారు. మార్చిలో జరగబోయే రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.