Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల మేకర్, ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా వ్యాప్తంగా 20 లక్షల కార్లను రీకాల్ చేయనుంది. టెస్లా కార్లలోని ఆటోపైలట్ అధునాతన సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలో కొత్త సేఫ్‌గార్డ్‌ని ఇన్‌స్టాల్ చేసేందుకు, ఈ సిస్టమ్‌ని మిస్ యూస్ చేయకుండా రక్షణ తీసుకునేందుకు టెస్లా కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ 2.03 మిలియన్ మోడల్ S, X, 3 మరియు Y వాహనాలకు అప్‌డేట్‌ను విడుదల చేస్తుందని తెలిపింది.
నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) టెస్లా కార్లపై గత రెండేళ్లుగా దర్యాప్తు చేస్తోంది. డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వాడే సమయంలో కార్ డ్రైవర్ జాగ్రత్తగా ఉంటున్నాడా.. లేదా..? అని దర్యాప్తు చేస్తోంది. ఆటోపైలట్ వ్యవస్థ, దాని సాఫ్ట్‌వేర్ డ్రైవర్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి సరిపోకపోవచ్చని, క్రాష్ ప్రమాదాన్ని పెంచవచ్చని రీకాల్ ఫైలింగ్‌లో టెస్లా పేర్కొంది.
Read Also: Madhya Pradesh: సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే సంచలన ఆదేశాలు.. లౌడ్ స్పీకర్లపై నిషేధం..
యాక్టింగ్ NHTSA అడ్మినిస్ట్రేటర్ ఆన్ కార్ల్‌సన్ ఈ సంవత్సరం ప్రారంభంలో రాయిటర్స్‌తో మాట్లాడుతూ “మానవులు టెక్నాలజీని ఎక్కువగా విశ్వసిస్తున్నారని డ్రైవర్ పర్యవేక్షణ వ్యవస్థలు పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.” అని అన్నారు. ఆటో స్టీర్ పనిచేస్తున్న సమయంలో నిరంతర డ్రైవింగ్ బాధ్యతలకు కట్టుబడి ఉండేలా డ్రైవర్ని మరింత ప్రోత్సహించేలా, అదనపు నియంత్రణ కోసం హెచ్చరించేలా ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అమలు చేస్తామని టెస్లా తెలిపింది.
టెస్లా వాహనాలు స్టేషనరీ ఎమర్జెన్సీ వాహనాలను ఢీకొన్న సంఘటనల తర్వాత ఆగస్టు 2021లో ఆటోపైలట్ వ్యవస్థపై దర్యాప్తు ప్రారంభమైంది. టెస్లా ఆటోపైలట్ వ్యవస్థ తమ లైన్‌లో ఆటోమెటిక్‌గా నడపడానికి వేగవంతం చేయడానికి, బ్రేక్స్ వేయడానికి ఉద్దేశించబడింది, అయితే మెరుగుపరచబడిన ఆటోపైలట్ వ్యవస్థ హైవేలపై లేన్లను మార్చడానికి సాయపడుతుంది, కానీ వాటిని స్వతంత్రంగా చేయలేదు. 2016 నుంచి ఆటో పైలట్ వ్యవస్థ ఉపయోగించబడుతోంది, NHTSA ప్రకారం టెస్లా ఆటోపైటల్ వ్యవస్థ వల్ల ఇప్పటి వరకు ప్రమాదాల్లో 23 మంది మరణించారు.