Hamas: హమాస్ ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 7 నాటి దాడి సమయంలో మహిళలపై హమాస్ ఉగ్రవాదులు అత్యాచారాలకు పాల్పడుతూ, వారిని హత్యలు చేశారు. చిన్న పెద్దా, ముసలి వారనే తేడా లేకుండా హత్యలు చేశారు. చిన్న పిల్లల తలలను వేరు చేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఆ దాడి సమయంలో జరిగిన సంఘటనల గురించి ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. సీఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బందీల్లో ఒకరైన రాజ్ కోహెన్ హమాస్ ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని వెల్లడించారు.
MLA Slaps Police: విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడం వివాదాస్పదం అయింది. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. పూణేలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై బీజేపీ ఎమ్యెల్యే చేయి చేసుకున్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఈ రోజు తెలిపారు.
Alaska Airlines Boeing 737 MAX: అలస్కా ఎయిర్ లైన్స్‌కి చెందిన బోయింగ్ 737-9 MAX విమానం తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. టేకాఫ్ అయిన కొద్ధి నిమిషాలకే గాలిలో ఉండగానే విమానం డోర్ తెరుచుకుంది. దీంతో విమానం ఒక్కసారిగా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. ప్రయాణికులు ఈ ఘటనను చిత్రీకరించారు. దీంట్లో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తోంది.
Girls Missing: మధ్యప్రదేశ్ 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. రాజధాని భోపాల్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ అక్రమ షెల్టర్ హోమ్ నుంచి గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 26 మంది బాలికలు మిస్సైనట్లు అధికారులు తెలిపారు. బాలికల్లో ఎక్కువగా గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్‌లకు చెందిన వారు కాగా.. కొందరు మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్లకు చెందిన వారు ఉన్నారు.
IIT Bombay: దేశంలో ఐఐటీ అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఐఐటీలో చదివిన విద్యార్థులకు దేశంలోనే కాదు ప్రపంచస్థాయిలో తీవ్రమైన డిమాండ్ ఉంది. ఈ విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులను తమ ఉద్యోగంలో చేర్చుకోవాలని మల్టీ నేషనల్ కంపెనీలు ఉవ్విళ్లూరుతుంటాయి.
Ram Mandir: అయోధ్యంలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సాధువులతో సహా 7000 మంది అతిథులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఇదిలా ఉంటే రామజన్మభూమి-బాబ్రీ మసీదులో వివాదంలో మాజీ న్యాయవాదిగా ఉన్న ఇక్బాల్ అన్సారీని జనవరి 22న జరగబోయే కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని అందించింది.
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ను తన అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈమెతో పాటు రెండోసారి సంజయ్ సిగ్, ఎన్డీ గుప్తాలను నామినేట్ చేసింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)ఈ రోజు నామినేషన్లను ప్రకటించింది.
Dhirendra Shastri: రామాలయ ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో, కేంద్రం చేస్తున్న కార్యక్రమాలపై ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి శుక్రవారం స్పందించారు. ‘‘ఇది అతడి భయాన్ని తెలియజేస్తోందని, మేము మసీదులపై మందిరాలను నిర్మించడం లేదని, దేవాలయాలను పునర్నిర్మించాలని అనుకుంటున్నామని, అతడికి ఈ భయం ఉంటే, ఆ భయంతోనే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అంటూ ఓవైసీని ఉద్దేశిస్తూ అన్నారు.
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీ హిట్లర్ ప్రచారం వ్యవస్థల పనిచేస్తోందని, అధికారంలో ఉన్న వారు గోమూత్రాన్ని మాత్రమే చూస్తారని ఆయన గురువారం అన్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రైవేటీకరణ, తప్పుడు ప్రచారం చేయడం, ముస్లిం సమాజంపై ద్వేషాన్ని పెంచడం, దూకుడు జాతీయవాదం ఇది బీజేపీ ప్రధాన అంశాలని శరద్ పవార్ అన్నారు.
UN Economic Report: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక నివేదిక వెల్లడించింది. 2024లో కూడా భారత వృద్ధి 6.2 శాతానికి చేరుకోగలదని యూఎన్ ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక తెలిపింది. భారత వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని, అయితే ఇది 2023లోని 6.3 శాతంతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని యూఎన్ రిపోర్ట్ అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధికి దేశీయ…