Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ మల్టీస్టారర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం మెగా అభిమానులు మాత్రమే కాదు టాలీకుడ్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4వ తేదీన విడుదల చేయబోతున్నామని అంటూ విడుదల చేసిన పోస్టర్ మెగాభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో అంచనాలు అంబరాన్ని అంటేలా ఉన్నాయి. అనిల్ రావిపూడి తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తోడుగా, ఈసారి హై-వోల్టేజ్ మాస్ సహా క్రైమ్ డ్రామా ఎలిమెంట్స్‌ను కూడా జోడించబోతున్నారు.
READ ALSO: Jananayakudu: ‘జన నాయకుడు’ని రేపే దింపుతున్నారు..
భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ‘మీసాల పిల్ల’ సాంగ్ ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘శశిరేఖ’ మెలోడీ 40 మిలియన్ల మార్కును చేరువలో ఉంది. చిరంజీవి-వెంకటేష్ కలిసి స్టెప్పులేసిన ‘సంక్రాంతి అదిరిపోద్ది’ సాంగ్ పక్కా సెలబ్రేషన్ ఎంథమ్‌గా నిలిచింది. పోస్టర్‌లో చిరంజీవి వైట్ షర్ట్, డార్క్ ప్యాంట్ ధరించి, ఒక మోకాలిపై నిలబడి షాట్‌గన్ పట్టుకుని ఉన్న లుక్ అదిరిపోయింది. ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, క్యాథరిన్ ట్రెసా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. వీటీవీ గణేష్ కామెడీ హైలైట్ కానుంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ అప్పుడే మొదలయ్యాయి. ఇప్పటికే 100K డాలర్ల మార్కును దాటి ఓవర్సీస్‌లో మెగాస్టార్ స్టామినాను నిరూపిస్తోంది.
READ ALSO: Pawan Kalyan: ఎవరో వస్తారనుకుంటే సూరి వచ్చాడు..టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!