Ram Mandir: అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సాధువులతో సహా 7000 మంది అతిథులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఇదిలా ఉంటే రామజన్మభూమి-బాబ్రీ మసీదులో వివాదంలో మాజీ న్యాయవాదిగా ఉన్న ఇక్బాల్ అన్సారీని జనవరి 22న జరగబోయే కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని అందించింది.
Read Also: Halal Certificate: సుప్రీంకోర్టుకు చేరిన హలాల్ సర్టిఫికెట్ వివాదం.. యూపీ సర్కార్ కు నోటీసులు
ఇక్బాల్ అన్సారీ బాబ్రీ మసీదుకు మద్దతుగా వాదనలు వినిపించారు. అంతకుముందు ఆగస్టు 5, 2020న జరిగిన రామమందిరపు ‘భూమిపూజ’ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం కూడా అందింది. డిసెంబర్ 30న అయోధ్యంలో ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం పలికిన వందలాది మందిలో ఇక్బాల్ అన్సారీ కూడా ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు అయోధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్, విమానాశ్రయాల ప్రారంభానికి వెళ్లిన సందర్భంలో అన్సారీ ప్రధాని కాన్వాయ్‌పై పూల వర్షాన్ని కురిపించారు. ప్రధాని నరేంద్రమోడీ మా ప్రాంతానికి వచ్చారు. ఆయన మా అతిధి, మన ప్రధాన మంత్రి అన్ని ఆ సమయంలో అన్సారీ అన్నారు.
నవంబర్ 9, 2019 న, అయోధ్య వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, చారిత్రాత్మక తీర్పును చెప్పింది. అదే సమయంలో అయోధ్యలోనే వేరే ప్రాంతంలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తిగా సాంప్రదాయ నాగర శైలిలో రామమందిరాన్ని నిర్మించారు. మందరిం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి.